‘సీనయ్య’ ఫస్ట్ లుక్ విడుదల

Seenaiah Telugu Movieహైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు వివి వినాయక్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘సీనయ్య’. ఈ సినిమాను  ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది.  వినాయక్‌ మాస్‌ లుక్‌తో ఫస్ట్ లుక్ లో కనిపిస్తున్నారు.  ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్‌ శంకర్‌ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన ఎన్.నరసింహ ‘సీనయ్య’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో నరసింహ ‘శరభ’ అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా 2018లో వచ్చిన ఇంటెలిజెంట్‌ సినిమాకు వినాయక్‌ చివరగా దర్శకత్వం వహించారు. ‘సీనయ్య’ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా  రెగ్యులర్‌ షూటింగ్‌  త్వరలోనే ప్రారంభం కానుంది. బుధవారం వినాయక్‌ తన 45వ పుట్టినరోజు జరుపుకుంటుండడంతో ఆయనకు ‘సీనయ్య’ సినిమా యూనిట్ శుభాకాంక్షలు తెలిపింది.

Seenaiah Telugu Movie First Look Release

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘సీనయ్య’ ఫస్ట్ లుక్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.