ఢిల్లీ కాట్రా మధ్య రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్

Vande Bharat Express

 

న్యూఢిల్లీ: ఆసక్తిగా ఎదురు చూస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెండో రైలును ప్రయాణికులు ఎక్కువగా ఉండే ఢిల్లీ కాట్రా మార్గంలో నడపబోతున్నారు. వారానికి మూడు రోజులు నడిచే ఈ రైలు వచ్చే నెల నుంచి ప్రారంభం కావచ్చని అధికార వర్గాలు సోమవారం తెలిపాయి. కాట్రా నుంచి వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. కాబట్టి రద్దీ విపరీతంగా ఉంటుంది. రద్దీని తగ్గించేందుకు రైల్వే బోర్డు ఢిల్లీ కాట్రా రూట్‌ను ఎంచుకుంది. ఈ హై స్పీడ్ రైలు వల్ల ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. ఢిల్లీ నుంచి వైష్ణోదేవికి వెళ్లేందుకు చివరి స్టేషన్ కాట్రా. ప్రస్తుతం ఈ ప్రయాణానికి 12 గంటల సమయం పడుతోంది. అయితే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 8 గంటలే పడుతుంది.

మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లేదా ట్రయిన్ 18ని ఢిల్లీ వారణాసి మార్గంలో ప్రారంభించారు. ‘వందే భారత్ రెండో రైలు ప్రస్తుతానికి ప్రతి సోమ, గురు, శని వారాల్లో నడుస్తుంది. అవసరమైతే మరో రెండు రోజులు పొడిగించి వారానికి అయిదు రోజులు కూడా నడపవచ్చు’ అని ఆ వర్గాలు తెలిపాయి. ఈ రైలు ఢిల్లీ నుంచి ఉదయం ఆరు గంటలకు బయలుదేరుతుంది. మధ్యాహ్నం రెండు గంటలకు కాట్రా చేరుకుంటుంది. అలాగే కాట్రా నుంచి అదే రోజు మధ్యాహ్నం మూడుకు బయలుదేరి రాత్రి 11కు ఢిల్లీ చేరుకుంటుంది. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ రైలు కాట్రా చేరే మార్గంలో రెండేసి నిముషాల చొప్పున అంబాలా, లూధియానా, జమ్మూతావి స్టేషన్లలో ఆగుతుంది.

Second Vande Bharat Express Between Delhi And Katra

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఢిల్లీ కాట్రా మధ్య రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.