బ్యాగుల భారం తగ్గేనా…!

  పుస్తకాల భారంపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల జారీ బాధ్యత అంతా విద్యాశాఖపైనే గతేడాది తనిఖీల్లో చాలా విషయాలు వెలుగులోకి ఉమ్మడి జిల్లాలో విద్యార్థులు ఐదు లక్షలు నిజామాబాద్ : ఎదిగి ఎదగని వయసులోనే పాఠశాలకు వెళ్తున్న చిన్నారులు (విద్యార్థులు) బడి బ్యాగు భారంగా మారింది. ప్రతిదినం ఉదయం పూట గ్రామీణ, పట్టణ ప్రయాణ ప్రాంగణాల వద్ద, ప్రధాన కూడళ్ల వద్ద విద్యార్థుల భుజాలపై మోయలేని పుస్తకాల సంచులను చూస్తుంటే ఎవరికైనా జాలి కలుగకమానదు. అంత బరువులు […] The post బ్యాగుల భారం తగ్గేనా…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పుస్తకాల భారంపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల జారీ
బాధ్యత అంతా విద్యాశాఖపైనే
గతేడాది తనిఖీల్లో చాలా విషయాలు వెలుగులోకి
ఉమ్మడి జిల్లాలో విద్యార్థులు ఐదు లక్షలు

నిజామాబాద్ : ఎదిగి ఎదగని వయసులోనే పాఠశాలకు వెళ్తున్న చిన్నారులు (విద్యార్థులు) బడి బ్యాగు భారంగా మారింది. ప్రతిదినం ఉదయం పూట గ్రామీణ, పట్టణ ప్రయాణ ప్రాంగణాల వద్ద, ప్రధాన కూడళ్ల వద్ద విద్యార్థుల భుజాలపై మోయలేని పుస్తకాల సంచులను చూస్తుంటే ఎవరికైనా జాలి కలుగకమానదు. అంత బరువులు ఎలా మోస్తున్నారని అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రైవేట్ పా ఠశాలలకు వెళ్లే విద్యార్థుల అవస్థలు వర్ణతీతం.

పుస్తకాలు, గైడ్స్, నోటు పుస్తకాలు, టిఫిన్‌బాక్స్, వాటర్‌బాటిల్ ఇలా అన్నింటిని బ్యాగు ద్వారా మోస్తూ అవస్థలు పడుతున్నారు. విద్యార్థులు వారి బరువుకు మించి పుస్తకాలను మోయాల్సి వస్తుంది. ఇది చిన్నారుల ఎదుగుదలపై ఆరోగ్య పరిస్థితిపై ప్రభావం చూ పుతోందని పలు అద్యయానాల్లో రుజువైంది. ఈ నేపథ్యంలో బడి బ్యాగు బరువు తగ్గింపుపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం నవంబర్ 20న కొన్ని మార్గదర్శకాలు తయారు చేసింది. అయినా బ్యాగుల భా రంపై క్షేత్రస్థాయిలో ఎటువంటి మార్పులేదు. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లాలో మార్గదర్శకాల అమలుపై మనతెలంగాణ ప్రత్యేక కథనం.

బ్యాగుల బరువులతో పిల్లల అవస్థలు
గత ఏడాది వరంగల్ జిల్లాలో అధిక బరువు గల బ్యాగును 5వ అంతస్తులోకి మోసుకెళ్తు 9వ తరగతి బాలిక అక్కడికక్కడే కుప్పకూలీ మ రణించింది. ఈ ఒక్క సంఘటన చా లు ప్రైవేట్ పాఠశాలల్లో బ్యాగుల బ రువుల అవస్థలు చెప్పడానికి. ఉమ్మ డి జిల్లాలో 2137 పాఠశాలల పరిధిలో 5లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉమ్మడి జిల్లాలో చాలా పాఠశాలల్లో విద్యార్థుల తరగతి గదులు 2వ,3వ అంతస్థుల్లో ఉండడం వల్ల విద్యార్థు లు పుస్తకాల భారాన్ని మోయలేకపోతున్నా రు. ప్రభుత్వ పాఠశాలల్లో బ్యాగుల భా రం అంతగా లేకపోయిన ప్రైవేట్ పాఠశాలలో మాత్రం విపరీతంగా ఉంది. బ్యాగులను మోయడం వ ల్ల పిల్లలకు చిన్నతనం నుండే వెన్నునొప్పి సమస్యలు వస్తున్నాయి. ఎక్కువ బరువులు మోయడం వల్ల న డుం, మోకాళ్ల పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఒక్కో సందర్భంలో మానసిక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది.

నిర్దేశిత బరువు కంటే ఎక్కువే
కేంద్ర ప్రభుత్వం తరగతుల వారిగా బ్యాగుల బరువులను నిర్ణయించిన నూతన మార్గదర్శకాలు అమలుకు నోచుకోవడం లేదు.
1,2 తరగతులకు 1.5 కిలోలు, 3,5 తరగతులకు 2.3 కిలోలు, 6,10 తరగతులకు 4,5 కిలోల బరువు ఉండాలని విద్యాశాఖా అధికారులు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ప్రైవేట్, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల బ్యాగులయితే 6 నుండి12కిలోలు, ఉన్నత పాఠశాల విద్యార్థుల బ్యాగులయితే 105 నుండి 15 కిలోల బరువు ఉంటోంది. దీంతో ఎక్కువ బరువుగల బ్యాగులను మోయడం కారణంగా విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నూతన మార్గదర్శకాలు
1. రెండవ తరగతి ఉండాల్సిన బ్యాగు బరువు 1.5 కిలోలు విద్యా
* పాఠశాల బ్యాగుల మార్గదర్శకాలు ఇలా :
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నవంబర్‌లో పాఠశాల బ్యాగుల బరువు విషయంలో కొన్ని మార్గదర్శకాలు రూపొందించినవి ఇవి.
* పాఠశాల విద్యార్థులకు శుద్ధ్దజలం అందుబాటులో ఉంచాలి. దీంతో విద్యార్థులు ఇంటి నుండి నీళ్ల బాటిళ్లు తీసుకురారు. తద్వారా బ్యాగు బరువు తగ్గే అవకాశం ఉంది.
* ప్రాథమిక తరగతుల విద్యార్థులకు ఇంటి పని ( హోంవర్క్)ఉండద్దు.
* 1,2 తరగతుల విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం, గణితం పాఠ్యంశాలు మాత్రమే ఉండాలి.
* 3 నుండి 5వ తరగతిలోపు విద్యార్థులు తెలుగు, ఆంగ్లం, గణితం, సైన్స్‌కు రూపొందించిన పుస్తకాలను మాత్రమే వినియోగించుకోవాలి.

ఎక్కువ నోట్‌పుస్తకాలు ఉండవద్దు.
* 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు 6నుండి7 పాఠ్యపుస్తకాలుంటాయి. ప్రతి సబ్జెక్టుకు 200 పేజీల నోట్ పుస్తకాన్ని ఇవ్వాలి.
ఇంతకుమించి ఆ బ్యాగులో ఏమి ఉండకూడదు. గైడ్లు, టెస్ట్ పేపర్లు, ప్రాజెక్టు పుస్తకాలు బ్యాగుల్లో ఉండవద్దు.
* పాఠశాలల్లోనే వినియోగించి మళ్లీ పాఠశాలల్లోనే పెట్టి రావాల్సి ఉంటుంది.

ఈ విద్యా సంవత్సరంలోనైనా మార్గదర్శకాలు అమలు జరిగేనా
ప్రస్తుత విద్యాసంవత్సరంలో పిల్లల సంచుల బరువులపై యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, అధికారులు ఇకనైనా దృష్టి పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం బ్యా గు బరువుల మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు నిరంతరం తనిఖీ లు చేపట్టాలి. అవసరమైతే తూకం మిషన్ల ద్వారా ఎప్పటికప్పుడు ప్రతి పాఠశాలను పర్యవేక్షించాలి. ప్రైవేట్ యాజమాన్యాలతో సమావేశాలు ఏర్పాటు చేసి బ్యాగుల బరువులు పెరగకుండా ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వాలి. తల్లిదండ్రులకు కూడా బ్యాగుల బరువుల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను వివరించాలి.

School bag became burden

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బ్యాగుల భారం తగ్గేనా…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: