జూమ్ యాప్‌ను నిషేధించడంపై కేంద్రం స్పందన కోరిన సుప్రీంకోర్టు

SC seeks Centre reply on plea to ban Zoom app

 

న్యూఢిల్లీ : జూమ్ యాప్‌పై చట్టం చేసే వరకూ నిషేధం విధించడంపై అభిప్రాయం చెప్పాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది.

జూమ్ యాప్ వల్ల పౌరుల గోప్యత హక్కుకు భంగం వాటిల్లుతుందని, సైబర్ నేరాలు పెరగడానికి అవకాశం కల్పిస్తుందంటూ ఢిల్లీకి చెందిన హర్ష్‌చుఘ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ ఎస్‌ఎ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం విచారణ జరిపింది.

నాలుగు వారాల్లోగా అభిప్రాయం తెలపాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. జూమ్ యాప్‌ను ఇప్పటికే పలు దేశాలు నిషేధించాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. దేశ సైబర్ భద్రతా సంస్థ సెర్ట్‌ఇన్ కూడా జూమ్ వినియోగదారులను సైబర్ నేరాలకు గురయ్యే అవకాశమున్నదని హెచ్చరించినట్టు పిటిషనర్ తెలిపారు.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జూమ్ యాప్‌ను నిషేధించడంపై కేంద్రం స్పందన కోరిన సుప్రీంకోర్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.