అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు

SC

 

న్యూఢిల్లీ: అయోధ్య రామజన్మభూమి చారిత్రక తీర్పుపై వేసిన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నవంబర్ 9న అయోధ్య వివాదాస్పద భూమిపై ఇచ్చిన తీర్పును సమీక్షించాలని, తమకు న్యాయం జరిగేలా చూడాలని ముస్లిం పక్షాలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను గురువారం ఐదుగురు సభ్యుల ధర్మాసనం తిరస్కరించింది. దీంతో అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి అన్నీ అడ్డంకులు తొలగిపోయినట్లు అయ్యింది. అయోధ్య తీర్పుకు వ్యతిరేకంగా వేసిన 18 రివ్యూ పిటిషన్లపై సిజెఐ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ప్రత్యేక ఛాంబర్ లో విచారణ జరిపింది.

కాగా, వివాదాస్పద అయోధ్య స్థలంలో రామ మందిరం నిర్మించాలని, మసీదుకు అయోధ్యలోనే మరో చోట 5 ఎకరాల భూమి ఇవ్వాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

SC dismisses all Ayodhya verdict review pleas

The post అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.