ఎస్‌బిఐ లాభం రూ.838 కోట్లు

  విశ్లేషకుల అంచనాలను అందుకోని బ్యాంక్ తగ్గు ముఖం పట్టిన ఎన్‌పిఎలు న్యూఢిల్లీ : దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ క్యూ4(జనవరిమార్చి) ఫలితాల్లో నిరాశపర్చింది. ఈ త్రైమాసికంలో విశ్లేషకుల అంచనా కంటే తక్కువగా లాభాన్ని నమోదు చేసింది. శుక్రవారం ప్రకటించిన నాలుగో త్రైమాసిక ఫలితాల్లో బ్యాంకు రూ. 838.40 కోట్ల నికరలాభం నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో బ్యాంకు రూ. 7718 కోట్ల నష్టం నమోదు చేసింది. ఎస్‌బిఐ ఈసారి రూ. 4890 […] The post ఎస్‌బిఐ లాభం రూ.838 కోట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

విశ్లేషకుల అంచనాలను అందుకోని బ్యాంక్
తగ్గు ముఖం పట్టిన ఎన్‌పిఎలు

న్యూఢిల్లీ : దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ క్యూ4(జనవరిమార్చి) ఫలితాల్లో నిరాశపర్చింది. ఈ త్రైమాసికంలో విశ్లేషకుల అంచనా కంటే తక్కువగా లాభాన్ని నమోదు చేసింది. శుక్రవారం ప్రకటించిన నాలుగో త్రైమాసిక ఫలితాల్లో బ్యాంకు రూ. 838.40 కోట్ల నికరలాభం నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో బ్యాంకు రూ. 7718 కోట్ల నష్టం నమోదు చేసింది. ఎస్‌బిఐ ఈసారి రూ. 4890 కోట్ల లాభాన్ని ఆర్జిస్తుందని విశ్లేషకులు అంచనా వేయగా, దానికన్నా చాలా తక్కువగా లాభాలను నమోదు చేసింది. క్యు3లో బ్యాంకు రూ. 3,954 కోట్ల లాభం నమోదు చేసింది. అయితే ఆస్తుల నాణ్యత పరంగా బ్యాంకు మెరుగుపడింది. బ్యాంకు స్థూల ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తులు)లు 8.71 శాతం నుంచి 7.73 శాతానికి, నికర ఎన్‌పిఎలు 3.95 శాతం నుంచి 3.01 శాతానికి దిగివచ్చాయి. గతేడాది రూ. 28 వేల కోట్లున్న ప్రొవిజన్లు ప్రస్తుతం రూ.16,502 కోట్లకు తగ్గాయి. ప్రొవిజన్ కవరేజ్ నిష్పత్తి 78.73 శాతంగా ఉంది. తాజా స్లిపేజ్‌లు క్యూ3లో రూ.4523 కోట్లుండగా ప్రస్తుతం రూ.7,505 కోట్లకు చేరాయి. నికర వడ్డీ ఆదాయం 14.91 శాతం పెరుగుదలతో రూ. 22,953 కోట్లకు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో ఎస్‌బిఐ షేరు విలువ 3 శాతం పెరిగి రూ.308 వద్ద స్థిరపడింది.

గృహ రుణాల వడ్డీ రేటు తగ్గింపు

ఎస్‌బిఐ మరోసారి ఎంసిఎల్‌ఆర్(మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్)లో 5 బేసిస్ పాయింట్ల మేరకు కోత విధించింది. నెల రోజుల్లో వరుసగా రెండో సారి వడ్డీ రేట్లను తగ్గిస్తూ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గింపుతో ఎంసిఎల్‌ఆర్ 8.5 శాతం నుంచి 8.45 శాతానికి దిగొచ్చింది. ఈ నెల 10 నుంచి ఈ వడ్డీ రేటు అమల్లోకి వస్తుందని ఎస్‌బిఐ ప్రకటించింది. ఈ రేట్ ఆధారంగా రుణాలు తీసుకున్న అన్ని అకౌంట్లలో కొద్ది మొత్తంతో ఇఎంఐ భారం తగ్గనుంది. ఏప్రిల్ నెలలో ఆర్‌బిఐ పరపతి విధాన సమీక్ష ముగిసిన వెంటనే ఎస్‌బిఐ 5 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 10 నుంచి ఇప్పటివరకూ విధించిన కోతల నేపథ్యంలో ఎంసిఎల్‌ఆర్ 15 బేసిస్ పాయింట్లు అంటే 1.5 శాతం వడ్డీ రేట్లు తగ్గినట్టు అయింది. ఉదాహరణకు రూ.25 లక్షల హౌసింగ్ లోన్‌ను 20 ఏళ్ల కాలపరిమితికి తీసుకుంటే 8.5 శాతం వడ్డీతో ప్రతి నెలా ఇఎంఐ రూ.21,696 ఉంటుంది. అదే తాజాగా తగ్గిన 5 బేసిస్ పాయింట్లతో పోల్చిచూస్తే ఇఎంఐ భారం రూ.21,617కి తగ్గింది.

SBI reports Q4 profit of Rs 838 crore

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎస్‌బిఐ లాభం రూ.838 కోట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: