బ్యాంకు సేవలకు ఎస్‌బిఐ కొత్త చార్జీలు

State Bank of India

 

నెలలో 3 సార్లకన్నా ఎక్కువ సార్లు నేరుగా జమ చేసినా వడింపు
అక్టోబర్ 1నుంచి అమలులోకి..

న్యూఢిల్లీ: బ్యాంకు సేవలు, లావాదేవీల చార్జీలను భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బిఐ) మరోసారి సవరించింది. కొత్త చార్జీలు అక్టోబర్ 1నుంచి అమలులోకి రానున్నాయి. బ్యాంకుల్లో నగదు జమ, ఉపసంహరణ, ఎటిఎం సేవలు, చెక్కుల వినియోగం వంటి సేవలకు గాను చార్జీల్లో మార్పులు చేసినట్లు ఎస్‌బిఐ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం బ్యాంకులో నేరుగా నగదు జమను నెలలో మూడుసార్లు మాత్రమే ఉచితంగా చేసుకోవచ్చు. ఆ తర్వాతనుంచి చార్జీలు తప్పవు. కనీసం వంద రూపాయలు జమ చేసినా రూ. 50 (జిఎస్‌టి అదనం) చెల్లించాల్సి ఉంటుంది. నెల వ్యవధిలో నగదు జమ అయిదో సారి కూడా దాటితే రూ.56 చార్జీ కట్టాల్సి ఉంటుంది. ఏదైనా కారణం వల్ల చెక్ బౌన్స్ అయితే రూ.150 (జిఎస్‌టితో కలిపి రూ.168)చార్జీలు విధిస్తారు.

మెట్రో నగరాల్లో 10 ఎటిఎం విత్‌డ్రాలు
దేశంలోని ఆరు మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో ఇకనుంచి ప్రతి నెలా పది ఎస్‌బిఐ ఎటిఎం విత్‌డ్రాలు ఉచితంగా లభించనున్నాయి. మిగతా నగరాల్లో ఈ సంఖ్య 12గా ఉండనుంది. వేరే బ్యాంకు ఎటిఎంలలో ఐదు విత్‌డ్రాలు మాత్రమే ఉచితంగా లభించనున్నాయి. ఖాతాలో రూ.25 వేలకు మించి సొమ్ము ఉంచే వారికి అపరిమిత ఎటిఎం సేవలు అందనున్నాయి. వేతనాలు పొందే ఖాతాదారులకు కూడా అపరిమితంగా ఉచిత ఎటటిఎం సేవల వెసులుబాటు కల్పించారు.

ఆర్‌టిజిఎస్, నెఫ్ట్ సేవలకూ..
ఒక వేళ ఖాతాదారు బబ్యాంకుకు వెళిల నేరుగా ఆర్‌టిజిఎస్, లేదా ఎన్‌ఇఎఫ్‌టి (నెఫ్ట్)లావాదేవీలు జరపాలనుకుంటే అక్టోబర్ 1నుంచి అదనపు చార్జీలు చెల్లించక తప్పదు. ఆర్‌టిజిఎస్‌లో రూ.2 లక్షలనుంచి రూ.5 లక్షల వరకు లావాదేవీ జరిపితే రూ.20, రూ.5లక్షలకు పైబడిన వాటికి రూ.40 (పన్నులు అదనం) చార్జీలు విధిస్తారు. ఇవే సేవలు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, లేదా యోనో బ్యాంకింగ్ ద్వారా పొందితే ఎలాంటి చార్జీలు చెల్లించనక్కర లేదు. ఇక రూ.10 వేల లోపు నెఫ్‌ట లావాదేవీలకు రూ.2, రూ.లక్ష లోపు రూ.4,రూ.2 లోల లోపు రూ.12, అంతకు మించిన లావాదేవాలకు రూ.20 అదనపు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

SBI new charges to Bank Services from October 1

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బ్యాంకు సేవలకు ఎస్‌బిఐ కొత్త చార్జీలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.