మరోసారి ఎస్‌బిఐ రుణాలపై వడ్డీ రేటు తగ్గింపు

SBI

 

ఎఫ్‌డి రేట్లలోనూ 0.10 శాతం కోత

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బిఐ ఐదోసారి రుణాలపై వడ్డీ రేటులో కోత విధించింది. సోమవారం 10 బేసిస్ పాయింట్ల మేరకు వడ్డీ రేటులో కోత విధించింది. ఇది మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ వెల్లడించింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి బ్యాంక్ 40 బేసిస్ పాయింట్ల మేరకు వడ్డీ రేటును తగ్గించినట్టైంది. దీంతో ఎంసిఎల్‌ఆర్ (మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్) 8.25 నుంచి 8.15 శాతానికి తగ్గనుంది. ఎస్‌బిఐ రుణాలు ఎంసిఎల్‌ఆర్‌తో అనుసంధానమై ఉన్నాయి. బ్యాంకులు ఎంసిఎల్‌ఆర్ ఆధారంగా 2016 నుంచి రుణాలు ఇస్తున్నాయి. నిర్వహణ ఖర్చులు, నగదు నిల్వ నిష్పత్తిని నిర్వహించడం వంటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు ఎంసిఎల్‌ఆర్‌ను నిర్ణయిస్తాయి. అలాగే రిటైల్ డిపాజిట్లపై రేటులో 20 నుంచి 25 బేసిస్ పాయింట్లు, బల్క్ టర్మ్ డిపాజిట్లపై 10 నుంచి 20 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది.

ఎస్‌బిఐ ఎంసిఎల్‌ఆర్ తగ్గింపు
ఒక రోజుకు 7.90% నుంచి 7.80% తగ్గుతుంది
ఒక నెలకు 7.90% నుంచి 7.80 శాతానికి
మూడు నెలలకు 7.95% నుంచి 7.85 శాతానికి
ఆరు నెలలు 8.10% నుంచి 8 శాతానికి
సంవత్సరానికి 8.25% నుంచి 8.15 శాతానికి
రెండేళ్లు 8.35% నుంచి 8.25 శాతానికి
మూడేళ్లు 8.45% నుంచి 8.35 శాతానికి తగ్గుతుంది

రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై వడ్డీరేట్లు
7-45 రోజులకు 4.50% మార్పులేదు
46-179 రోజులు 5.50% మార్పులేదు
180-210 రోజులు 6% నుంచి 5.80%కి తగ్గింపు
211 రోజుల నుండి 1 సంవత్సరం 6% నుంచి 5.80%కి తగ్గింపు
1-2 సంవత్సరాలు 6.70% నుంచి 6.50%కి తగ్గింపు
2-3 సంవత్సరాలు 6.50% నుంచి 6.25%కి తగ్గింపు
3-5 సంవత్సరాలు 6.25% నుంచి 6.25%కి తగ్గింపు
5-10 సంవత్సరాలు 6.25% నుంచి 6.25%కి తగ్గింపు
(సీనియర్ సిటిజన్లకు రేట్లు భిన్నంగా ఉంటాయి)

2 కోట్లపైన డిపాజిట్లపై వడ్డీ రేట్లు
7-45 రోజులు 4.40% నుంచి 4.30%కి తగ్గింపు
46-179 రోజులు 5.40% నుంచి 5.30%కి తగ్గింపు
180-210 రోజులు 5.90% నుంచి 5.70%కి తగ్గింపు
211 రోజుల నుండి ఏడాది 5.90% నుంచి 5.70%కి తగ్గింపు
1-2 సంవత్సరాలు 6.40% నుంచి 6.30%కి తగ్గింపు
2-3 సంవత్సరాలు 6.15% నుంచి 6%కి తగ్గింపు
3-5 సంవత్సరాలు 5.90% నుంచి 5.75%కి తగ్గింపు
5-10 సంవత్సరాలు 5.90% నుంచి 5.75%కి తగ్గింపు
(సీనియర్ సిటిజన్లకు రేట్లు భిన్నంగా ఉంటాయి)

SBI FD has announced a 0.10% reduction

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మరోసారి ఎస్‌బిఐ రుణాలపై వడ్డీ రేటు తగ్గింపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.