ఎస్‌బిఐ రుణ రేట్లు 0.05% కోత

SBI
ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు తగ్గింపు

న్యూఢిల్లీ: దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ రుణ రేట్లు లేదా ఎంసిఎల్‌ఆర్‌లో 0.05 శాతం కోతపెట్టింది. అలాగే డిపాజిట్ రేట్లు కూడా 0.15 శాతం నుండి 0.75 శాతం మధ్య తగ్గించిం ది. ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఎంసిఎల్‌ఆర్ ఆధారిత రుణాల వడ్డీ రేటు 0.05 శాతం తగ్గింపుతో 8.05 శాతం నుండి 8 శాతానికి చేరనుంది. కొత్త రేట్లు నవంబర్ 10 నుండి అమల్లోకి వస్త్తా యి. ఎస్‌బిఐ శుక్రవారం ఈ సమాచారం ఇచ్చింది. చాలా రుణ వడ్డీ రేట్లు ఒక సంవత్సరం ఎంసిఎల్‌ఆర్‌తో ముడిపడి ఉన్నాయని తెలిపిం ది. రుణాన్ని చౌకగా చేయడంతో పాటు, డిపాజిట్ల వడ్డీ రేట్లను కూడా బ్యాంక్ తగ్గించింది. వీటిని 0.15 శాతం నుండి 0.75 శాతం మధ్య తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.

అయితే చాలా కోతలు రూ.2 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ స్థిర డిపాజిట్ రేట్లలో ఉన్నాయి. ఎస్‌బిఐ కేవలం 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు రూ.2కోట్ల లోపు డిపాజిట్లపై వడ్డీ రేటును తగ్గించింది. ఇది 6.40 శాతానికి బదులుగా 6.25 శాతం ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు ఈ రేటు 6.90 శాతానికి బదులుగా 6.75 శాతం ఉంటుంది. ఎంసిఎల్‌ఆర్ ఆధారంగా రుణాలు తీసుకు నే కొత్త కస్టమర్లు తక్షణ ప్రయోజనాలను పొందుతారు. అయితే పాత కస్టమర్లకు వడ్డీ రేట్లు వారి రుణం రీసెట్ తేదీలోమాత్రమే మారుతా యి. ఎంసిఎల్‌ఆర్‌తో పాటు ఆర్‌బిఐ రెపో రేటు ఆధారంగా ఎస్‌బిఐ రుణాలు ఇస్తుంది. దీంతో లింక్ లోన్లు తీసుకునే వినియోగదారులందరికీ ఆర్‌బిఐ రెపో రేటును వెంటనే తగ్గించే ప్రయోజనం లభిస్తుంది.

2కోట్లు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్లపై వడ్డీ రేటు
వ్యవధి ప్రస్తుత వడ్డీ రేటు నవంబర్ 10నుంచి

7-45 రోజులు 4.50% 4%
46-179 రోజులు 5.30% 4.75%
180-210 రోజులు 5.70% 5.25%
211 నుండి ఏడాది 5.70% 5.25%
1-2 ఏళ్లు 6% 5.25%
2-3 ఏళ్లు 6% 5.25%
3-5 ఏళ్లు 5.75% 5.25%
5-10 ఏళ్లు 5.75% 5.25%

SBI cuts lending rates

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎస్‌బిఐ రుణ రేట్లు 0.05% కోత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.