ఎస్‌బిఐ అత్యవసర రుణ సదుపాయం

ముంబై: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వ్యాపారాలు దెబ్బతిన్న నేపథ్యంలో రుణగ్రస్తుల ద్రవ్యకొరత సమస్యను తీర్చేందుకు ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) అత్యవరస రుణ సదుపాయాన్ని అందిస్తోంది. కోవిడ్ 19 ఎమర్జెన్సీ లోన్ ఫెసిలిటీ (సిఇసిఎల్) పేరిట అదనపు నగదు సదుపాయాన్ని ప్రవేశపెట్టినట్టు ఎస్‌బిఐ పేర్కొంది, దీని కోసం రూ.200 కోట్ల వరకు నిధులను సమకూరుస్తున్నామని, 2020 జూన్ 30 నాటికి ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని బ్యాంక్ తెలిపింది. దీని కింద 12 నెలల కాలానికి […] The post ఎస్‌బిఐ అత్యవసర రుణ సదుపాయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబై: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వ్యాపారాలు దెబ్బతిన్న నేపథ్యంలో రుణగ్రస్తుల ద్రవ్యకొరత సమస్యను తీర్చేందుకు ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) అత్యవరస రుణ సదుపాయాన్ని అందిస్తోంది. కోవిడ్ 19 ఎమర్జెన్సీ లోన్ ఫెసిలిటీ (సిఇసిఎల్) పేరిట అదనపు నగదు సదుపాయాన్ని ప్రవేశపెట్టినట్టు ఎస్‌బిఐ పేర్కొంది, దీని కోసం రూ.200 కోట్ల వరకు నిధులను సమకూరుస్తున్నామని, 2020 జూన్ 30 నాటికి ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని బ్యాంక్ తెలిపింది. దీని కింద 12 నెలల కాలానికి 7.25 శాతం వడ్డీ రేటుతో రుణం ఇవ్వనుంది.

కోవిడ్ -19తో ప్రభావితమైన వ్యాపార సంస్థల రుణగ్రహీతలకు కొంత ఉపశమనం కలిగించడానికి, అర్హులైన రుణగ్రహీతలకు అదనపు లిక్విడిటీ లోన్ సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించినట్లు బ్యాంక్ అన్ని శాఖలకు పంపిన సర్క్యులర్‌లో తెలిపింది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితిని అధిగమించడానికి సిఇసిఎల్ సహాయం చేస్తుంది. 2020 మార్చి 16 వరకు ఎస్‌ఎంఎ1, 2 గా వర్గీకరించని అన్ని ప్రామాణిక ఖాతాలకు రుణ సౌకర్యం అందుబాటులో ఉందని, వారు ఈ రుణ సౌకర్యాన్ని పొందవచ్చని బ్యాంక్ తెలిపింది. ఎన్‌పిఎలుగా లేదా ఒత్తిడికి గురైన ఆస్తులుగా మారే ఖాతాలను గుర్తించడానికి స్పెషల్ మెన్షన్ అకౌంట్ (ఎస్‌ఎంఎ)ను ప్రవేశపెట్టింది.

SBI COVID 19 Emergency Credit loan

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎస్‌బిఐ అత్యవసర రుణ సదుపాయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.