కనీస నగదు నిల్వ అవసరం లేదు…

  చెక్ బుక్‌లు, ఇతర సౌకర్యాలకు ఛార్జీలు వసూలు చేయవద్దు బ్యాంకులకు ఆర్‌బిఐ ఆదేశాలు న్యూఢిల్లీ: బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలపై నిబంధనలను ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) సవరించింది. విలువ ఆధారిత సౌకర్యాలు, చార్జీలు లేకుండా, కనీస బ్యాలెన్స్ అవసరం లేకుండా బ్యాంకులు అందివ్వాలని ఆదేశించింది. ఈ కొత్త నిబంధనలు జులై 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ (బిఎస్‌బిడి) ఖాతాలు కనీస నగదు నిల్వ ఉండాలన్న నిబంధనను […] The post కనీస నగదు నిల్వ అవసరం లేదు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చెక్ బుక్‌లు, ఇతర సౌకర్యాలకు ఛార్జీలు వసూలు చేయవద్దు
బ్యాంకులకు ఆర్‌బిఐ ఆదేశాలు

న్యూఢిల్లీ: బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలపై నిబంధనలను ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) సవరించింది. విలువ ఆధారిత సౌకర్యాలు, చార్జీలు లేకుండా, కనీస బ్యాలెన్స్ అవసరం లేకుండా బ్యాంకులు అందివ్వాలని ఆదేశించింది. ఈ కొత్త నిబంధనలు జులై 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ (బిఎస్‌బిడి) ఖాతాలు కనీస నగదు నిల్వ ఉండాలన్న నిబంధనను సెంట్రల్ బ్యాంక్ ఎత్తివేసింది. జీరో బ్యాలెన్స్ ఖాతాదారులకు ఇకపై చెక్ బుక్‌లు, ఇతర సౌకర్యాలను ఎలాంటి చార్జీలు వసూలు చేయవద్దని, వీటి కనీస బ్యాలెన్స్ అవసరం లేదని ఈ మేరకు ఆర్‌బిఐ ఆదేశాలు జారీ చేసింది. అలాగే విత్‌డ్రాలపై నిబంధనలను కూడా సడలించింది.

బ్యాంకులు, ఎటిఎంల నుంచి నెలకు 4 సార్లు డబ్బులు విత్‌డ్రా చేసుకునే సౌకర్యం కల్పించింది. అలాగే బ్యాంకు ఖాతాల్లో ఎన్నిసార్లైన డిపాజిట్ చేసుకునే సదుపాయంతో పాటు ఉచిత ఎటిఎం లేదా డెబిట్ కార్డు జారీ, యాక్టివేషన్ ఛార్జీలు వసూలు చేయరాదని ఆదేశించింది. ఈ మేరకు అన్ని బ్యాంకులకు కేంద్ర బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది. బిఎస్‌బిడి ఖాతాకు సంబంధించి ఎటువంటి చార్జీ లేకుండానే ఎటిఎం కార్డు, పాస్‌పుస్తకం లభిస్తుంది. ఖాతా ఉన్న ఖాతాదారులు మరి ఏ ఇతర ఖాతాను కలిగి వుండడానికి వీల్లేదు. ఒక వేళ వుంటే అకౌంట్‌ను ఓపెన్ చేసిన 30 రోజుల వ్యవధిలోనే సదరు ఖాతాను మూసి వేయాల్సి వుంటుంది.

జులై 1 నుంచి ఆన్‌లైన్ ఛార్జీలు రద్దు

ఈ నెల ప్రారంభంలో ద్రవ్యపరపతి విధాన సమీక్షలో డిజిటల్ లావాదేల చార్జీలపై రద్దు చేస్తున్నట్టు ఆర్‌బిఐ ప్రకటించింది. అయితే ఎప్పటి నుంచో తెలియజేయలేదు. తాజాగా దీనిపై ఆర్‌బిఐ ప్రకటన చేసింది. ఆన్‌లైన్ బ్యాంకు లావాదేవీలకు జులై 1 నుంచి ఛార్జీలు వసూలు చేయవద్దని ఈమేరకు అన్ని బ్యాంకులకు ఆర్‌బిఐ ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌ఇఎఫ్‌టి (నెఫ్ట్), ఆర్‌టిజిఎస్ ద్వారా నగదు బదిలీకి చార్జీలు వసూలు చేయవద్దని బ్యాంకులకు తెలిపింది. ఐదు రోజుల క్రితం ఆన్‌లైన్ సేవలకు ఛార్జీలు రద్దు చేస్తూ ప్రకటన చేసిన ఆర్‌బిఐ తాజాగా మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది.

Savings Bank accounts not need minimum balance

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కనీస నగదు నిల్వ అవసరం లేదు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: