’ధరణి’ దీక్ష ను విజయవంతం చేయండి…

ఖమ్మం కల్చరల్ : పర్యావరణాన్ని కాపాడటం కోసం, భూతాపాన్ని తగ్గించటం కోసం, ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలని, మొక్కలను పెంచాలనే ధ్యేయంతో ప్రజా చైతన్యం కలిగించే కార్యక్రమంలో బాగంగా ఈనెల 22న ధరిత్రీ దినోత్సవం సందర్బంగా నిర్వహించే ’ధరణీ దీక్ష’ను విజయవంతం చేయాలని వైబ్రెంట్స్ ఆఫ్ కలాం వ్యవస్థాపకులు విజయ్‌కలాం పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మంలోని ’కలాం విజన్ సెంటర్ ’ కార్యాలయంలో దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా విజయ్‌కలాం మాట్లాడుతూ… భూమిని కాపాడుకోవాలనే నినాదంతో […] The post ’ధరణి’ దీక్ష ను విజయవంతం చేయండి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఖమ్మం కల్చరల్ : పర్యావరణాన్ని కాపాడటం కోసం, భూతాపాన్ని తగ్గించటం కోసం, ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలని, మొక్కలను పెంచాలనే ధ్యేయంతో ప్రజా చైతన్యం కలిగించే కార్యక్రమంలో బాగంగా ఈనెల 22న ధరిత్రీ దినోత్సవం సందర్బంగా నిర్వహించే ’ధరణీ దీక్ష’ను విజయవంతం చేయాలని వైబ్రెంట్స్ ఆఫ్ కలాం వ్యవస్థాపకులు విజయ్‌కలాం పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మంలోని ’కలాం విజన్ సెంటర్ ’ కార్యాలయంలో దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా విజయ్‌కలాం మాట్లాడుతూ… భూమిని కాపాడుకోవాలనే నినాదంతో ధర్నాచౌక్‌లో ధరణీదీక్ష ఉదయం 8.30 గంటలకు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్.వి, కర్ణన్ ముఖ్యఅతిధిగా హాజరవుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి శ్రీను, సంస్థ బాద్యులు శ్రీకాంత్, రాజ్‌కుమార్, నవీన్, పవన్, సతీష్, హర్ష, మనూష తదితరులు పాల్గొన్నారు.

 

Save the environment

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ’ధరణి’ దీక్ష ను విజయవంతం చేయండి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: