సమ్మె కొనసాగిస్తాం

  నేడు డిపోల వద్ద సేవ్ ఆర్‌టిసి నిరసనలు భవిష్యత్ కార్యాచరణపై నేటి భేటీలో నిర్ణయం : అశ్వత్థామరెడ్డి హైదరాబాద్ : షరతులు లేకుండా విధుల్లోకి పిలిస్తే సమ్మె విరమిస్తామని రెండు రోజుల క్రితం ప్రకటించిన ఆర్‌టిసి జెఎసి కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి తాజాగా సమ్మె కొనసాగిస్తామని వెల్లడించారు. ఆర్‌టిసి సమ్మె యధాతథంగా జరుగుతుందని శుక్రవారం మీడియా సమావేశంలో అశ్వత్థామరెడ్డి చెప్పారు. ఆర్‌టిసి సమ్మెపై జెఎసి నేతల ప్రతిపాదనలపై ప్రభుత్వం స్పందించని క్రమంలో శుక్రవారం అశ్వత్థామరెడ్డి ఈ కీలక […] The post సమ్మె కొనసాగిస్తాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నేడు డిపోల వద్ద సేవ్ ఆర్‌టిసి నిరసనలు
భవిష్యత్ కార్యాచరణపై నేటి భేటీలో నిర్ణయం : అశ్వత్థామరెడ్డి

హైదరాబాద్ : షరతులు లేకుండా విధుల్లోకి పిలిస్తే సమ్మె విరమిస్తామని రెండు రోజుల క్రితం ప్రకటించిన ఆర్‌టిసి జెఎసి కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి తాజాగా సమ్మె కొనసాగిస్తామని వెల్లడించారు. ఆర్‌టిసి సమ్మె యధాతథంగా జరుగుతుందని శుక్రవారం మీడియా సమావేశంలో అశ్వత్థామరెడ్డి చెప్పారు. ఆర్‌టిసి సమ్మెపై జెఎసి నేతల ప్రతిపాదనలపై ప్రభుత్వం స్పందించని క్రమంలో శుక్రవారం అశ్వత్థామరెడ్డి ఈ కీలక ప్రకటన చేశారు. సమ్మె విరమణకు తాము సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సమ్మె కొనసాగింపుగా శనివారం అన్ని డిపోల వద్ద సేవ్ ఆర్‌టిసి పేరుతో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్మికుల వల్ల ఆర్‌టిసికి నష్టం రాలేదని, ప్రభుత్వ విధానాల వల్లే సంస్థ నష్టాల్లోకి వచ్చిందని ఆయన ఆరోపించారు.

తాము ఎన్నో మెట్టు దిగొచ్చి, సమ్మెను విరమిస్తామని ప్రకటించినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్మికులకు కూడా అశ్వత్థామరెడ్డి పలు సూచనలు చేశారు. తమకు డ్యూటీలు వేయాలని కార్మికులెవరూ అధికారుల వద్దకు వెళ్లొద్దని ఆయన చెప్పారు. పరకాలలో డ్రైవర్లు సంపత్, రత్నంలు డిపో మేనేజర్లను కలవగా, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని డిపో మేనేజర్లు వారిని వెనక్కి పంపారు. ఈ రకంగా డిపోల వద్దకు వెళ్లి అడగొద్దని కార్మికులకు అశ్వత్థామరెడ్డి చెప్పారు.

శనివారం మరోసారి జెఎసి నేతల సమావేశం నిర్వహించి.. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని అశ్వత్థామరెడ్డి తెలిపారు. సమ్మెను ఇంకా ఉధృతం చేయాలని భావిస్తున్నట్లు జెఎసి కో..కన్వీనర్ రాజిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వంలో ఆర్‌టిసి విలీన అంశాన్ని పక్కన పెట్టినా ప్రభుత్వం చర్చలకు పిలవలేదన్నారు. ముఖ్యమంత్రి పిలుపుకోసం ఎదురుచూస్తున్నామని.. పిలుపు రాని పక్షంలో శనివారం జెఎసి సమావేశం ఏర్పాటు చేసుకుని సమ్మె కార్యచరణపై నిర్ణయం తీసుకుంటామని రాజిరెడ్డి చెప్పారు.

సిఎం చెప్పినప్పుడే చేరితే బాగుండేది.!
సమ్మె విషయంలో ఆర్‌టిసి జెఎసివి గందరగోళ నిర్ణయాలంటూ.. వాటిని వ్యతిరేకిస్తూ జెఎసి రాష్ట్ర కార్యదర్శి నగేష్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జెఎసి పెద్దలు స్టేట్ కమిటీ నేతలతో చెప్పకుండా సమ్మెపై విరమణ చేస్తామని ప్రకటించారని, కార్మికులు విధుల్లో చేరడానికి సిఎం కెసిఆర్ అవకాశమిచ్చినప్పుడే బేషరతుగా చేరివుంటే బాగుండేదని తెలిపారు. అలా చేసివుంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదని.. కార్మికుల ఆత్మహత్యలు జరిగేవికావని తెలిపారు. కార్మికుల బలిదానాలకు ఇప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారని నగేష్ పటేల్ ప్రశ్నించారు.

Save RTC protests at depots today

The post సమ్మె కొనసాగిస్తాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: