అడవుల రక్షణతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యం : సబితా ఇంద్రారెడ్డి

Save Environment : Minister Sabitha Indra Reddyచేవెళ్ల : అడవులను సృష్టించడంతో పాటు ఉన్న అడవులను కాపాడుకున్నప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని మంత్రి  సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని దుద్దాగు గ్రామంలో ఆరో విడత హరితహారంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. ఆకుపచ్చని తెలంగాణగా మార్చాలన్న ఆశయంతో సిఎం కెసిఆర్ ముందుకు సాగుతున్నారని, ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ విధిగా ఆరు మొక్కలు నాటి, వాటిని సరంక్షించాలని ఆమె స్పష్టం చేశారు. అడవులను నాశనం చేసి, అక్రమంగా కలపను తరలించే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఎ కాలే యాదయ్య,  డిసిసిబి చైర్మన్ పి. కృష్ణారెడ్డి, ఎంపిపి విజయలక్ష్మి, జడ్ పిటిసి మాలతి, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post అడవుల రక్షణతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యం : సబితా ఇంద్రారెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.