ఫార్చూన్ వ్యాపార నాయకుల జాబితాలో సత్య నాదెళ్లకు అగ్రస్థానం

Satya Nadella

 

న్యూయార్క్: దిగ్గజ ఐటి కంపెనీ మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య నాదెళ్ల 2019 అగ్ర వ్యాపార నాయకుడిగా ఎన్నికయ్యారు. ఫార్చ్యూన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ -2019 జాబితాలో నాదెళ్లతో సహా ముగ్గు రు అధికారులు భారత సంతతికి చెందినవారు చోటు దక్కించుకున్నారు. ఇందులో మాస్టర్ కార్డ్ సిఇఒ అజయ్ బంగా, అరిస్టా హెడ్ జయశ్రీ ఉల్లా ల్ ఉన్నారు. ప్రపంచంలో ప్రతిష్టాత్మక వ్యాపార పత్రిక ఫార్చ్యూన్ ప్రతి సంవత్సరం టాప్ -20 వ్యాపార నాయకుల జాబితాను విడుదల చేస్తుం ది. కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు భారీ లక్ష్యాలను సాధించడం, అసాధ్యమైన సవాళ్లకు సృజనాత్మక పరిష్కారాలను కలిగి ఉంటారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన సత్య నాదెల్ల 2014లో మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టారు.

ఫార్చ్యూన్ మాట్లాడుతూ, కంప్యూటర్ శాస్త్రవేత్త సత్య నాదెళ్ల ఎప్పు డూ ఫైనాన్స్ రంగంలో పనిచేయలేదు లేదా సిఇఒ వంటి పదవికి శిక్షణ పొందలేదు. గత ఐదేళ్లలో సంస్థను ముందుకు నడిపించారు. అతని విజయానికి కీలకమైనది నాయకత్వ సామర్థ్యం. నాదెళ్లకు త్రిమూర్తులు ఎంతో దోహదపడ్డారు. ఇందులో పాలసీ, చట్టపరమైన విషయాలను నిర్వహించే చైర్మన్ బ్రాడ్ స్మిత్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అమీ హుడ్, చీఫ్ పబ్లిక్ ఆఫీసర్ కాథ్లీన్ హొగన్ ఉన్నారు. కాగా భారతీయ- అమెరికన్ పౌరుడు, మాస్టర్ కార్డ్ సిఇఒ అజయ్‌పాల్ సింగ్ బంగా ఫార్చ్యూన్ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచా రు. ఇక 18 వ స్థానంలో నెట్‌వర్కింగ్ కంపెనీ అరిస్టా సిఇఒ జయశ్రీ ఉల్లాల్ ఉన్నారు.

Satya Nadella tops Fortune Businessperson of the Year list

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఫార్చూన్ వ్యాపార నాయకుల జాబితాలో సత్య నాదెళ్లకు అగ్రస్థానం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.