గ్రామాల సమస్యలపై అధికారులను నిలదీసిన సర్పంచ్‌లు

Sarva Sabhya Meeting

 

ఆదిలాబాద్: గ్రామీణ ప్రాంతంలో నెలకొన్న సమస్యలపై మూడు నెలల కొకసారి నిర్వాహించే సర్వసభ్య సమావేశం రసవత్తరంగా కొనసాగింది. సోమవారం మండల కేంద్రంలోని స్త్రీశక్తి భావన సమావేశ మందిరంలో ఎంపిపి సిడాం రాము అధ్యక్షతన నిర్వాహించిన సమావేశంలో నూతన సర్పంచులు అధికారుల పనితీరుపై అసహానం వ్యక్తం చేశారు. మండల స్థాయి అధికారులు సరైనా రీతిలో పనులు చేయక పోవడంతో గ్రామాల్లో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయన్నారు. అధికారులు ప్రతి అంశాన్ని సర్పంచులకు తెలియజేయాల్సి ఉండగా ఎలాంటి విషయాలు సర్పంచులకు తెలియజేయడం లేదని విమర్శించారు. తలమడుగు సర్పంచ్ కల్లెం కరుణాకర్‌రెడ్డి, వ్యవసాయాధికారి ఆర్‌డబ్లూఎస్ అధికారి తీరుపట్ల ఆసహానం వ్యక్తం చేశారు. రైతులకు సరైన సమాచారం ఇవ్వాలంటే ముందుగా సర్పంచ్ దృష్టికి తీసుకురావాలని అప్పుడే సర్పంచ్ రైతులందరికి తెలియజేస్తారన్నారు.

ఆర్‌డబ్లూస్ అధికారుల పనితీరు ఏ మాత్రం బాగాలేదని మండలానికి వచ్చే మిషన్ భగీరథ నీరును పరీక్షించకుండానే గ్రామాల్లోని ప్రజలకు తాగు నీరుగా అందిస్తున్నారని మిషన్ భగీరథ నీటిలో నీటి పోలిషన్ సమస్య ఉందని దాని వల్ల ప్రజలు రోగాల భారిన పడే అవకాశం ముందని ఎలాంటి హానీ జరగకముందే చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. సర్పంచ్‌లందరు మాట్లాడుతూ… వచ్చే సర్వ సభ్య సమావేశం నాటికి సమస్యలన్ని పూర్తి చేయాలని అన్ని శాఖల అధికారులను హెచ్చరించారు. ఈ సందర్భంగా చివరి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎంపిపి సిడాం రాము జడ్పిటిసి గంగమ్మ ఉపాధ్యక్షులు స్వామి, ఎంపిటిసిలను శాల్వ పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో సునీత, ఎంఆర్‌వో ఇమ్రాన్‌కాన్, ఈవోపిఆర్‌డి దిలిప్‌కుమార్, వైద్యులు డా రాహుల్, సర్పంచ్‌లు ఎంపిటిసిలు అధికారులు పాల్గొన్నారు.

Sarva Sabhya Meeting in Adilabad

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గ్రామాల సమస్యలపై అధికారులను నిలదీసిన సర్పంచ్‌లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.