డబ్బుకోసమే కాపుకాసి హత్య…

 killed

 

48 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు

నారాయణపేట  : డబ్బు కోసమే ఇద్దరు వ్యక్తులు నర్సాపూర్ గ్రామసర్పంచ్ తమ్ముడు నారాయణను కాపుకాసి దారుణంగా హత్యచేశారని, హత్య జరిగిన 48 గంటల్లో తమ సిబ్బంది కేసును చేధించారని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ చేతన పేర్కొన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్య కేసుకు సంబందించిన వివరాలను వెల్లడించారు. జిల్లా పరిధిలోని దామరగిద్ద మండలం కాన్‌కుర్తి గ్రామ శివారులోని ఎర్రగుట్ట దగ్గర నర్సాపూర్ గ్రామ సర్పంచ్ తమ్ముడు నారాయణ మృతదేహం ఈనెల 11వ తేదీన కనపడింది.

కాగా నారాయణ బియ్యం వ్యాపారం చేస్తు, వ్యాపారానికి సంబందించి డబ్బులు ఈనెల 10న రూ.7.68లక్షలు గుల్బర్గా నుండి తీసుకువస్తుండగా, ఈవిషయం తెలుసుకున్న మహబుబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలానికి చెందిన చించాటి వీరేశ్ (20), డ్రైవర్ మహేశ్ (23) ఇద్దరు కలిసి బులేరో వాహనంతో వెనకపడి కాన్‌కుర్తి గ్రామశివారులోని ఎర్రగుట్ట దగ్గర మాటువేసి ద్విచక్రవాహనంపై వస్తున్న నారాయణను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని, ద్విచక్రవాహనాన్ని 50 మీటర్ల ధూరంలో ముళ్ళ పొదల్లో వేసి డబ్బులు తీసుకుని పరారైనట్లు ఎస్పీ తెలిపారు.

మృతుడు నారాయణ ఇంటికి రాకపోవటంతో కుటుంబ సభ్యులు నారాయణ కోసం వెతకగా కాన్‌కుర్తి ఎర్రగుట్ట దగ్గర మృతదేహం కనపడటంతో పోలీసులకు తెలిపారు. దర్యాప్తు చేపట్టి పోలీసులు డాగ్ స్కాడ్, క్లూస్‌ను తీసుకుని విచారణ చేపట్టారు. అన్ని కోణాల నుండి విచారించగా మృతుడి ఫోన్ నుండి నిందుతులు ఫోన్‌కాల్ చేయగా ఆకాల్‌ల ఆధారంగా నిందుతులను పట్టుకుని అరెస్టు చేయటం జరిగిందని పేర్కొన్నారు. వారి నుండి రూ.7.26లక్షలను రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. కేసును చేదించిన సిఐ సంపత్, దామరగిద్ద ఎస్‌ఐ రాంబాబు, కానిస్టేబుల్స్ భాస్కర్, బీమప్ప, హరీష్, టాస్క్‌ఫోర్స్ కానిస్టుబుల్స్‌లను జిల్లా ఎస్పీ అబినందించి రివార్డులు ప్రకటించారు.

Sarpanch’s younger brother killed for money

Related Images:

[See image gallery at manatelangana.news]

The post డబ్బుకోసమే కాపుకాసి హత్య… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.