దీపావళికి కొత్త పోస్టర్

Sarileru Neekevvaru

 

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే దీపావళి పండుగకి ఫిల్మ్‌మేకర్స్ సమ్‌థింగ్ స్పెషల్‌గా టీజర్‌ను విడుదల చేస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ ప్రస్తుతానికి అటువంటిదేమీ లేదని తెలిసింది. దసరా పండుగకు ఒక పోస్టర్ ఇచ్చినట్టే రాబోయే దీపావళికి కూడా పోస్టర్‌తోనే సరిపెడతారని టాక్.

అయితే నవంబర్ మధ్యలో నుండి లేదా చివర నుండి వరుస ట్రీట్స్ ఖాయమని తెలిసింది. పాటలు, టీజర్, క్యారెక్టర్ పోస్టర్స్… ఇలా ఒకదాని వెంట మరొకటి వస్తూనే ఉంటాయట. కాబట్టి మహేష్ అభిమానులకు డిసెంబర్ నుండి గ్యాప్ లేకుండా సర్‌ప్రైజులే అన్నమాట. ఇకపోతే ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయకిగా నటిస్తుండగా తమన్నా ప్రత్యేక గీతంలో మెరువనుంది. విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Sarileru Neekevvaru movie New poster for Diwali

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post దీపావళికి కొత్త పోస్టర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.