ఆత్మకు అందంగా కనిపించాలి!

  స్టార్ కిడ్స్ కష్టపడరు, వారికి అవకాశాలు ఊరికే వచ్చేస్తాయి… గుర్తింపు కూడా కష్టపడకుండానే వస్తుంది అని కొందరు భావిస్తుంటారు. అటువంటి వారు సారా అలీఖాన్‌ను చూసి తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చిత్ర పరిశ్రమలో పైకి కనిపించినంత సులువుగా ఎవరికీ గుర్తింపు రాదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు సారా కొబ్బరిబొండంలాగా ఉండేదట. అయితే ఎప్పుడైతే హీరోయిన్ కావాలని నిర్ణయించుకుందో అప్పుడు తన బరువుపై దృష్టి పెట్టి దాదాపు ఏడాదిన్నర పాటు కఠినమైన కసరత్తులు చేసి […] The post ఆత్మకు అందంగా కనిపించాలి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

స్టార్ కిడ్స్ కష్టపడరు, వారికి అవకాశాలు ఊరికే వచ్చేస్తాయి… గుర్తింపు కూడా కష్టపడకుండానే వస్తుంది అని కొందరు భావిస్తుంటారు. అటువంటి వారు సారా అలీఖాన్‌ను చూసి తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చిత్ర పరిశ్రమలో పైకి కనిపించినంత సులువుగా ఎవరికీ గుర్తింపు రాదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు సారా కొబ్బరిబొండంలాగా ఉండేదట. అయితే ఎప్పుడైతే హీరోయిన్ కావాలని నిర్ణయించుకుందో అప్పుడు తన బరువుపై దృష్టి పెట్టి దాదాపు ఏడాదిన్నర పాటు కఠినమైన కసరత్తులు చేసి నాజూకుగా మారింది. లక్కీగా సారా నటించిన మొదటి రెండు సినిమాలు ‘కేదార్ నాథ్’, ’సింబా’లు హిట్ కావడంతో ఇప్పుడు క్రేజీ హీరోయిన్‌గా మారింది. అలా అని ఊరికే ఇంట్లో కూర్చుకుండా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ… అవకాశాలు లేని హీరోయిన్లు ఎంత కష్టపడుతూ అందాల ప్రదర్శనలు చేస్తారో అంతకంటే ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ తన సత్తా చాటుతోంది. తాజాగా ఈ భామ ఓ హాట్ ఫొటోను పోస్ట్ చేసింది. ఓ మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేసినదే ఈ ఫోటో కూడా. “కంటికి అందంగా కనిపించడం కాదు… ఆత్మకు అందంగా కనిపించాలి’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది సారా అలీఖాన్.

Sara Ali khan photo shoot for Magazine

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆత్మకు అందంగా కనిపించాలి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: