మ్యాచ్ ఫీజు విరాళంగా ఇచ్చిన సంజు శాంసన్

  న్యూఢిల్లీ: కేరళ యువ క్రికెటర్ సంజు శాంసన్ తన మ్యాచ్ ఫీజును మైదాన సిబ్బందికి విరాళంగా ఇచ్చాడు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో దక్షిణాఫ్రికా ఎతో జరిగిన ఆఖరి వన్‌డేలో శాంసన్ చెలరేగిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం రూ.1.5 లక్షలను మైదాన సిబ్బందికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు.‘ మైదానం తడిగా ఉండి ఉంటే మ్యాచ్‌ను రద్దు చేసి ఉండేవారు. ఈ మ్యాచ్ జరిగిందంటే దానికి కారణం సిబ్బంది. వారికి ధన్యవాదాలు. నా మాచ్ ఫీజును […] The post మ్యాచ్ ఫీజు విరాళంగా ఇచ్చిన సంజు శాంసన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: కేరళ యువ క్రికెటర్ సంజు శాంసన్ తన మ్యాచ్ ఫీజును మైదాన సిబ్బందికి విరాళంగా ఇచ్చాడు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో దక్షిణాఫ్రికా ఎతో జరిగిన ఆఖరి వన్‌డేలో శాంసన్ చెలరేగిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం రూ.1.5 లక్షలను మైదాన సిబ్బందికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు.‘ మైదానం తడిగా ఉండి ఉంటే మ్యాచ్‌ను రద్దు చేసి ఉండేవారు. ఈ మ్యాచ్ జరిగిందంటే దానికి కారణం సిబ్బంది. వారికి ధన్యవాదాలు. నా మాచ్ ఫీజును వారికి విరాళంగా ఇస్తున్నా’ అని చెప్పాడు.

వర్షం కారణంగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్ 48 బంతుల్లో 91 పరుగులు చేశాడు. ఆరు ఫోర్లు, ఏడు సిక్సర్లతో బౌలర్లపై విరుచుకు పడ్డాడు. అతనికి తోడుగా టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అర్ధ సెంచరీ (51) చేయడంతో ఇండియా ఎ 204 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్షంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఎ 168 పరుగులకే కుప్పకూలింది. దీంతో అయిదు వన్డేల సిరీస్‌ను భారత్ 41 తేడాతో సొంతం చేసుకుంది.

sanju samson donated Rs.1.5 lakh to Ground staff

The post మ్యాచ్ ఫీజు విరాళంగా ఇచ్చిన సంజు శాంసన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: