అగ్ని ప్రమాదంపై బిజెపి రాజకీయం : ఆప్ విమర్శ

Sanjay Singh

 

న్యూఢిల్లీ : ఢిల్లీ లోని అనాజ్ మండీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదాన్ని బిజెపి రాజకీయం చేస్తోందని ఆప్ విమర్శించింది. ఈ ప్రమాదంలో 43 మంది మృతికి బిజెపి నిర్వహణ లోని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసిడి) బాధ్యత వహించవలసి ఉంటుందని, ఆప్ సీనియర్ నేత సంజయ్‌సింగ్ పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన కుటీర పరిశ్రమ అక్రమంగా నిర్వహిస్తుంటే మూసివేయాల్సిన బాధ్యత ఎంసిడిదేనని ఆయన పేర్కొన్నారు.

ఆ కుటీర పరిశ్రమకు లైసెన్సులు జారీ చేయడంలో ఎంసిడి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆప్ అధికార ప్రతినిధి రాఘవ్ చద్ధా విమర్శించారు. ఈ ప్రమాదంపై ఢిల్లీ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఏడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ అగ్ని ప్రమాదంపై కాంగ్రెస్, బిజెపి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను తప్పు పడుతూ విమర్శించాయి. ఆ ఏరియాలో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని ఫిర్యాదులు వచ్చినా ఢిల్లీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు మనోజ్ తివారీ విమర్శించారు. ఆయన కేంద్ర మంత్రి హరదీప్ పురితో కలసి ఆదివారం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.

Sanjay Singh criticized the BJP govt over the fire in Delhi

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అగ్ని ప్రమాదంపై బిజెపి రాజకీయం : ఆప్ విమర్శ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.