శాంసంగ్ గెలాక్సీ నుంచి నయా ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌…

Samsung-Tabముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీదారు శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎ 10.1 (2019) పేరిట ఓ కొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను సోమవారం ఇండియన్ మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఈ ట్యాబ్‌కు చెందిన వైఫై వేరియెంట్ ధర రూ.14,999 కాగా… దీన్ని జూన్ 26వ తేదీ నుంచి కేవలం అమెజాన్, శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్స్‌లో మాత్రమే కస్టమర్లకు అందుబాటులో ఉంచనున్నారు. అలాగే ఈ ట్యాబ్‌కు చెందిన వైఫై+4జి వేరియెంట్ ధర రూ.19,999 ఉండగా దీన్ని జూలై 1 నుంచి అమ్మనున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎ 10.1 (2019) అద్భుత ఫీచర్లు…

10.1 ఇంచ్ డిస్‌ప్లే, 1920 x 1200 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,

ఆక్టాకోర్ ఎగ్జినోస్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్,

32 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,

ఆండ్రాయిడ్ 9.0 పై, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 వంటి అద్భత ఫీచర్లు శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎ 10.1 (2019)లో ఉన్నాయి.

Samsung Galaxy Tab 10.1 Launched in India

Related Images:

[See image gallery at manatelangana.news]

The post శాంసంగ్ గెలాక్సీ నుంచి నయా ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.