శామ్‌సంగ్ మడత ఫోన్ వచ్చేసింది

‘గెలాక్సీ ఫోల్డ్’ పేరుతో విడుదల ధర రూ.1.40 లక్షల పైమాటే తొలి 5జి ఫోన్ కూడా… శాన్‌ఫ్రాన్సిస్కో: స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శామ్‌సంగ్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న ఒక కార్యక్రమంలో దక్షి ణ కొరియా దిగ్గజ సంస్థ శామ్‌సంగ్ ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. గెలాక్సీ ఫోల్డ్‌గా తీసుకొచ్చిన ఈ ఫోన్ మడతపెట్టినప్పుడు 4.6 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఫోన్‌ను తెరిస్తే 7.3 అంగుళాల ట్యాబ్‌గా ఉపయోగించుకోవచ్చు. అమెరికాలో ఏప్రిల్ […]

‘గెలాక్సీ ఫోల్డ్’ పేరుతో విడుదల
ధర రూ.1.40 లక్షల పైమాటే
తొలి 5జి ఫోన్ కూడా…

శాన్‌ఫ్రాన్సిస్కో: స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శామ్‌సంగ్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న ఒక కార్యక్రమంలో దక్షి ణ కొరియా దిగ్గజ సంస్థ శామ్‌సంగ్ ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. గెలాక్సీ ఫోల్డ్‌గా తీసుకొచ్చిన ఈ ఫోన్ మడతపెట్టినప్పుడు 4.6 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఫోన్‌ను తెరిస్తే 7.3 అంగుళాల ట్యాబ్‌గా ఉపయోగించుకోవచ్చు. అమెరికాలో ఏప్రిల్ 26నుంచి గెలాక్సీ ఫోల్డ్ అ మ్మకాలు మొదలవుతాయి.అక్కడ దీని ప్రారంభ ధర 19 80 డాలర్లుగా ఉండనుంది. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ.1.40 లక్షల పైమాటే.

ఫోన్‌ను ట్యాబ్‌గా వాడేటప్పుడు ఒకేసారి మూడు యాప్‌లను తెరుచుకోవచ్చని కంపెనీ తెలిపింది. దీనితో పాటుగా తొలి 5జి ఫోన్ ను కూడా శామ్‌సంగ్ ఆవిష్కరించింది. ఎస్10 మోడళ్లలో ఒకదానిని 5జి ఫోన్‌గా తీసుకొస్తోంది.ఈ ఎస్10 సిరీస్ లో మొత్త నాలుగు ఫోన్లను కంపెనీ తీసుకు వచ్చి ంది.ఎస్ 10,ఎస్ 10 5జి, ఎస్ 10ఇ, ఎస్10 ప్లస్‌లను శామ్‌సంగ్ ఆవిష్కరించింది. వీటిలో ఎస్10, ఎస్10ఇ, ఎస్10ప్లస్‌ల విక్రయాలు మార్చి8నుంచి ప్రారంభం అవనున్నాయి. వీటి ప్రారంభ ధర 749 డాలర్లుగా ఉంది. ఎస్ 10 5జి ధర, విడుద ల తేదీని కం పెనీ ఇంకా ప్రకటించలేదు. కాగా ఈఫోన్లుభారత మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయనే దానిపైనా శామ్‌సంగ్ స్పష్టత ఇవ్వలేదు.

‘గెలాక్సీ ఫోల్డ్’ ఫీచర్లు
7.3 అంగుళాల డిస్‌ప్లే,12 జిబి ర్యామ్, 512 జిబి ఇంటర్నల్ స్టోరేజి,4,380ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థం దీనిలో ఉంటాయి. ఈ ఫోన్‌లో మొత్త ఆరు కెమెరాలున్నా యి. వెనుక వైపు 16 మెగాపిక్సెల్‌తో ఒక కెమెరా, 12 మె గా పిక్సెల్ రెండు కెమెరాలు, ముందు వైపు మూడు కెమెరాలుండగా, ఫోన్ మడతపెట్టినప్పుడు రెండు కెమెరాలు లోపలికి వెళ్తాయి.10 మెగా పిక్సెల్‌తో సెల్ఫీకెమెరా ఉంది. కాగా దీనిలో ఆండ్రాయిడ్ ‘పై’ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది.

Samsung Galaxy Fold has a foldable display

Related Stories: