శాంసంగ్ గెలాక్సీ ఏ70ఎస్ స్మార్ట్‌ఫోన్ విడుదల

Galaxy-A70sముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీదారు శాంసంగ్ గెలాక్సీ ఎ70ఎస్ పేరిట ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా ఇండియన్  మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఈ  స్మార్ట్ ఫోన్‌కు చెందిన 6జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియెంట్ రూ.28,999 ధరకు, 8జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియెంట్ రూ.30,999 ధరలకు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌లో వినియోగదారులను ఆకట్టుకునే అద్భతమైన ఫీచర్ల ఉన్నాయని సంస్థ అధికారులు చెబుతున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎ70ఎస్ ఫీచర్లు….

6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే,

2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్,

6/8 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్,

ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్,

64, 5, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,

ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జి వివొఎల్‌టిఇ,

బ్లూటూత్ 5.0, యుఎస్‌బి టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ చార్జింగ్ వంటి జబర్దస్త్  ఫీచర్లను శాంసంగ్ అందిస్తోంది.

Samsung Galaxy A70s launched in India

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post శాంసంగ్ గెలాక్సీ ఏ70ఎస్ స్మార్ట్‌ఫోన్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.