కర్నాటక వరద బాధితులకు సంపూ విరాళం

Sampoorneshహైదరాబాద్ : బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఆపదలో ఉన్నవారికి తనవంతు సాయం చేస్తుంటాడు. ఇప్పటి వరకు ఆయన ఎన్నో గుప్త దానాలు చేశారు. ప్రస్తుతం కర్నాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  భారీ వర్షాల కారణంగా సుమారు 50 మంది వరకు చనిపోయారు. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. కర్నాటక వరదబాధితులను ఆదుకునేందుకు సంపూర్ణేష్ బాబు ముందుకొచ్చాడు. తన వంతు సాయంగా రూ.2 లక్షలను విరాళంగా అందించారు. కర్నాటకలో భారీ వర్షాలు, వరదలు రావడం తనను తీవ్రంగా కలిచి వేశాయని ఆయన పేర్కొన్నారు. తెలుగు ప్రజలతో పాటు కన్నడ ప్రజలు కూడా తన సినిమాలను ఆదరిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ ఆపద సమయంలో కర్నాటక ప్రజలను ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ ముందుకొచ్చి తమ వంతు సాయం చేయాలని ఆయన కోరుతున్నారు.

Sampoornesh Financial Help To Karnataka Flood Victims

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కర్నాటక వరద బాధితులకు సంపూ విరాళం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.