కృషి సంపత్‌కు బంగారు పతకం

 Photojournalism

 

ఖమ్మం : ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జాతీయ స్థాయిలో నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలలో ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని బైపాస్‌రోడ్డులో గల కృషి స్టూడియో ఆధినేత చావా సంపత్‌కుమార్‌కు ఫోటో జర్నలిజం విభాగంలో జాతీయ స్థాయిలో బంగారు పతకం లభించింది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కుంభమేళాను సంపత్ తన కెమెరాలో బందించాడు. కుంభమేళాలో ఒక నాగ సాధువులు త్రిశూలం, డమరుకంతో గుడి దగ్గర చేసే విన్యాసాలకు ఫోటో జర్నలిజం విభాగంలో బంగారు పతకం లభించింది.

మరో ఫోటోలో కుంభమేళాలో దేవాలయం, నాగ సాధువు విన్యాసం, భక్తులను అంతా ఒక ఫోటోలో చూపించారు. ఈ చాయ చిత్రానికి కూడా మరో అవార్డు లభించటం విశేషం. గతంలో సంపత్‌కు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గోదావరి పుష్కరాలు, మేడారం జాతర, బతుకమ్మ సంబరాలు వంటి ప్రతిష్టాత్మక పండుగలలో సైతం తన చక్కని ఫోటోగ్రఫీతో పలు రాష్ట్ర, అంతర్జాతీయ అవార్డులను సూతం అందుకున్నారు.

జాతీయ స్థాయిలో సాధించిన ఈ బంగారు పతకాన్ని ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో జరిగే కార్యక్రమంలో సంపత్ అందుకోనున్నారు. జాతీయ స్థాయిలో జరిగిన ఈ పోటీల్లో దేశ వ్యాప్తంగా వేలాది మంది ఫోటోగ్రాఫర్లు పోటీ పడగా తెలంగాణ రాష్ట్రం నుంచి సంపత్ ఒక్కడికే ఈ బంగారు పతకం రావటం విశేషం. ఈ సందర్భంగా సంపత్‌ను తెలంగాణ రాష్ట్ర , ఖమ్మం ఉమ్మడి జిల్లాలకు చెందిన ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నేతలు ప్రత్యేకంగా అభినందించారు.

Sampath was awarded the Gold Medal in Photojournalism

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కృషి సంపత్‌కు బంగారు పతకం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.