హార్రర్ చిత్రంలో సమంత

Samantha

కొన్నేళ్ళుగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తూ మంచి విజయాలను అందుకుంటోంది సమంత. అయితే తమిళంలో ఇప్పటికే విజయ్ సేతుపతితో కలిసి నటిస్తున్న ఆమె తాజాగా ‘గేమ్ ఓవర్’ ఫేమ్ అశ్విన్ శరవణన్ డైరెక్షన్‌లో ఒక చిత్రం చేయడానికి ఒప్పుకుంది. ఇందులో సమంత, ప్రసన్న ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రం పూర్తిగా హారర్ జానర్‌లో ఉంటుందని తెలిసింది. అశ్విన్ శరవణన్ గత చిత్రాలు గేమ్ ఓవర్, మాయలు కూడా హార్రర్ చిత్రాలే. ఈ రెండూ మంచి విజయాన్ని అందుకున్నాయి. అందుకే సమంత చిత్రంపై అంచనాలు బాగా పెరిగాయి. సమంతకు కూడా హార్రర్ జానర్‌లో సినిమాలు కొత్తేమీ కాదు. గతంలో రాజుగారి గది 2, యు టర్న్ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. మరి ఈసారి చేయబోతున్న హార్రర్ కథతో సమంత ఎలా భయపెడుతుందో చూడాలి.

Samantha to be seen in a horror film

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హార్రర్ చిత్రంలో సమంత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.