నయనతార స్థానంలో సమంత…

  వరసపెట్టి లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ తన సత్తా చూపిస్తోంది సమంత. పెళ్లయ్యాక ఆమెకు రొటీన్ కమర్షియల్ సినిమాల్లో చేయాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఆ అవకాశాన్ని ఆమె నటిగా తన స్థాయిని పెంచుకునేందుకు ఉపయోగించుకుంటోంది. తనే ప్రధాన పాత్రల్లో నటించే సినిమాలనే ఎంపిక చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆమెకు వరుసగా హిట్స్ కూడా లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నయనతార చేయాల్సిన ఒక సినిమా సమంత వైపు మొగ్గు చూపుతోందని సమాచారం. ఇదివరకు తమిళంలో వచ్చిన […] The post నయనతార స్థానంలో సమంత… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వరసపెట్టి లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ తన సత్తా చూపిస్తోంది సమంత. పెళ్లయ్యాక ఆమెకు రొటీన్ కమర్షియల్ సినిమాల్లో చేయాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఆ అవకాశాన్ని ఆమె నటిగా తన స్థాయిని పెంచుకునేందుకు ఉపయోగించుకుంటోంది. తనే ప్రధాన పాత్రల్లో నటించే సినిమాలనే ఎంపిక చేసుకుంటోంది.

ఈ నేపథ్యంలో ఆమెకు వరుసగా హిట్స్ కూడా లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నయనతార చేయాల్సిన ఒక సినిమా సమంత వైపు మొగ్గు చూపుతోందని సమాచారం. ఇదివరకు తమిళంలో వచ్చిన ‘అరమ్’ సినిమాకు సీక్వెల్‌లో సమంత నటించబోతోందని తెలిసింది. తెలుగులో ‘కర్తవ్యం’ పేరుతో విడుదలైన ఆ సినిమాకు సీక్వెల్ ప్రతిపాదన ఉంది. ముందుగా నయనతార అందులో నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సమంతకు ఆ అవకాశం దక్కబోతున్నట్టుగా తెలిసింది.

Samantha starring in Lady oriented Films

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నయనతార స్థానంలో సమంత… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: