‘రా’ చీఫ్‌గా బాలాకోట్ దాడి ప్లానర్…

Samant Goel

 

ఐబి అధిపతిగా అరవింద్ కుమార్

న్యూఢిల్లీ: భారత గూఢాచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాల్‌సిస్ వింగ్ (ఆర్&డబ్లు ఎ) తదుపరి చీఫ్‌గా సమంత్ గోయెల్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా అరవింద కుమార్‌ను బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ నియమించారు. కేబినెట్ నియామక కమిటీ చైర్మ న్ అయిన మోడీ రెండేళ్ల పదవీ కాలానికి గానూ వారి నియామకాలను ఆమోదించినట్లు సిబ్బంది మంత్రిత్వశాఖ ఉత్తర్వులో పేర్కొంది. ఇద్దరు 1984 బ్యాచ్‌కు చెందిన ఐపిఎస్ అధికారులే. గోయెల్ పంజాబ్ కేడర్ అధికారి కాగా, కుమార్ అసోం మేఘాలయ కేడర్‌కు చెందారు. ఈ నెలాంతంలో వారు బాధ్యతలు స్వీకరించనున్నారు. గోయెల్ ఫిబ్రవరిలో బాలాకోట్ సర్జికల్ దాడులు, 2016 లో ఉరి ఘటన అనంతరం జరిపిన దాడికి గోయెల్ ప్రణాళికలు రచించారు. వామపక్ష తీవ్రవాదం, కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడంతో కుమార్‌కు అనుభవం ఉంది.

Samant Goel as R&W A’s chief

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ‘రా’ చీఫ్‌గా బాలాకోట్ దాడి ప్లానర్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.