ప్యారిస్‌లో సామజవరగమన

Samajavaragamana song

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)లు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ‘సామజవరగమన…’ పాటకు అద్భుతమైన స్పందన వస్తోంది. సామాజిక మాధ్యమాలలో కొత్త రికార్డులను సృష్టిస్తూ మోస్ట్ వాచ్‌డ్ సాంగ్ ఇన్ సౌత్ ఇండియాగా నిలిచింది ఈ పాట. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం, సంగీత దర్శకుడు తమన్ అందించిన సంగీతం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఆడియో పరంగా ఇంతటి సెన్సేషన్ సృష్టించిన ఈ సాంగ్‌ను ప్రస్తుతం ప్యారిస్‌లోని పలు అందమైన ప్రదేశాలలో చిత్రీకరిస్తున్నారు. అల్లుఅర్జున్, పూజ హెగ్డేలపై చిత్రీకరిస్తున్న ఈ అందమైన గీతానికి శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూరుస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్ బ్యానర్‌లపై తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రంలో టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్కర్, తనికెళ్ళ భరణి,మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, రోహిణి, ఈశ్వరీరావు, కల్యాణి నటరాజన్, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, పమ్మిసాయి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరామెన్: పి.ఎస్.వినోద్, సంగీతం: తమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: రామ్-, లక్ష్మణ్.

Samajavaragamana is Most Watched Song in South India

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్యారిస్‌లో సామజవరగమన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.