ధోనీకి సాక్షి సర్‌ప్రైజ్ గిఫ్ట్

Gift

రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ , వికెట్ కీపర్ మహింద్ర సింగ్ ధోనీకి అతని భార్య సాక్షి అద్భుతమైన గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేసింది. గౌరవ లెఫ్టెనెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోనీ ప్రస్తుతం కశ్మీర్‌లో భారత ఆర్మీలో పని చేస్తున్నాడు. పారా రెజిమెంట్ బృందంతో కలిసి విధులు నిర్వర్తిస్తున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా తన బృందంతో వాలీబాల్, ఫుట్‌బాల్ వంటి ఆటలు ఆడుతున్నాడు. ఆగస్టు 15 వరకు అక్కడే ఉండి ధోనీ స్వాతంత్య్ర దినోత్సవం నాడు లేహ్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ధోనీకి ఎంతో ఇష్టమైన ‘ జీప్ గ్రాండ్ చెరోకీ’ అనే కారును కొన్న సాక్షి ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి ధోనీకి ఆ విషయాన్ని తెలియజేసింది. మొత్తానికి నీకు ఇష్టమైన ‘రెడ్‌బీస్ట్’ ఇంటికొచ్చింది. దానికి స్వాగతం. మహీ.. నిన్ను నిజంగా చాలా మిస్సవుతున్నా. బారత్‌లో ఈ మోడల్ కారు ఇదే మొదటిదయినందున దాని పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్నా’ అని పేర్కొంది. ధోనీకి కార్లన్నా, బైకులన్నా విపరీతమైన ఇష్టమనే విషయం తెలిసిందే. ఇప్పటికే అతని షెడ్డులో ఫెరారీ 599 జిటిఓ,హమ్మర్ హెచ్2, జిఎంసి సీరా వంటి కార్లు,కవాసాకి నింజా హెచ్ 2,కాన్ఫిడరేట్ హెల్‌కాట్, బిఎస్‌ఎ, సుజుకి హాయాబుసా వంటి బైకులున్నాయి.

Sakshi Dhoni gives a surprise gift to MS Dhoni

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ధోనీకి సాక్షి సర్‌ప్రైజ్ గిఫ్ట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.