బాలుడి ఆపరేషన్ విజయవంతం…కెటిఆర్ ట్వీట్

KTR

 

హైదరాబాద్ : ఎముకల్లో లోపంతో నడవలేని స్థితిలో ఉన్న సాయిరాం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావడంపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం జనవరిలో ఎముకల్లో లోపం వల్ల దొడ్డి కాళ్లతో నడువలేని పరిస్థితిలో ఉన్న సాయిరాం అనే బాలుడిని రామగుండం ఎంఎల్ఎ చందర్ తన దగ్గరకు తీసుకు వెళ్లారు. కెటిఆర్ సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయిరాం కాళ్లకు ఆపరేషన్ చేయించారు. సాయిరాంకు శస్త్ర చికిత్సలు పూర్తయిన తర్వత అతను అందరిలాగానే సాధారణంగా నడవగలుగుతున్నాడు. సాయిరాంకు అండగా నిలిచిన సిఎంఆర్ఎఫ్ కు ధన్యవాదాలు తెలుపుతూ… సాయిరాంతో గడిపిన క్షణాలు మంచి జ్ఞాపకాలు’గా ఉంటాయని కెటిఆర్ ట్విట్ చేశారు. సాయిరాం నడుస్తున్న ఫొటోను కెటిఆర్ ట్విట్టర్ లో షేర్ చేశారు.

Sairam being able to walk normally KTR in Twitter

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బాలుడి ఆపరేషన్ విజయవంతం… కెటిఆర్ ట్వీట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.