వరుణ్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన సాయిపల్లవి…

  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని మళయాలం బ్యూటీ సాయిపల్లవి స్వీకరించింది. ఇందులో భాగంగా గురువారం తన ఇంటి ప్రాంగణంలో సాయిపల్లవి మొక్కలు నాటింది. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విటర్ వేదికగా షేర్ చేసింది. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి క్షీణించిందని, ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని, దానికి ఇదే మంచి తరుణమని తెలిపింది. మనం ప్రకృతి నుంచి ఎక్కువగా తీసుకుంటూ.. ప్రకృతికి మాత్రం తక్కువగా ఇస్తున్నామని పేర్కొంది. ఇక, తనకు […] The post వరుణ్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన సాయిపల్లవి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని మళయాలం బ్యూటీ సాయిపల్లవి స్వీకరించింది. ఇందులో భాగంగా గురువారం తన ఇంటి ప్రాంగణంలో సాయిపల్లవి మొక్కలు నాటింది. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విటర్ వేదికగా షేర్ చేసింది. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి క్షీణించిందని, ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని, దానికి ఇదే మంచి తరుణమని తెలిపింది. మనం ప్రకృతి నుంచి ఎక్కువగా తీసుకుంటూ.. ప్రకృతికి మాత్రం తక్కువగా ఇస్తున్నామని పేర్కొంది. ఇక, తనకు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ విసిరిన వరుణ్‌తేజ్‌కు ఈ సందర్భంగా సాయిపల్లవి కృతజ్ఞతలు తెలిపింది. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు సమంతా, రాణా దగ్గుబాటిని సాయిపల్లవి నామినేట్‌ చేసింది. వారిద్దరూ మొక్కలు నాటాలని సూచించింది.

కాగా,  టిఆర్ఎస్ ఎంపి సంతోష్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ రోజు రోజుకూ విస్తరిస్తోంది. ఈ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్న సినీ స్టార్లు మొక్కలు నాటుతూ తమ సహచర నటులకు ఛాలెంజ్ విసురుతున్నారు. ఇటీవల అఖిల్ అక్కినేని విసిరిన ఈ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన వరుణ్ తేజ్… సాయిపల్లవి, తమన్నాను నామినేట్ చేసిన విషయం తెలిసిందే.

Sai Pallavi Takes up Varun Tej Green India Challenge

The post వరుణ్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన సాయిపల్లవి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: