‘ఫిదా’పిల్లపై యువ దర్శకుడు గరం..!

హైదరాబాద్:  ‘ఫిదా’ సినిమాతో బాన్సువాడ భానుమతిగా తమిళ బ్యూటీ సాయి పల్లవి కుర్రకారును ఫిదా చేసిన సంగతి తెలిసిందే. అందంతో పాటు అభినయంతో తెలుగు ప్రేక్షకులను మైమరింపించింది సాయి పల్లవి. తనదైన నటనతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడంలో సాయి పల్లవి కీలక పాత్ర పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ చిత్రం తర్వాత ఆమె నేచురల్ స్టార్ నానితో ‘ఎంసిఎ’ సినిమా చేసింది. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించింది.  దీంతో ఆమెకు తెలుగులో డిమాండ్ పెరిగింది. కానీ, సాయి పల్లవి […]

హైదరాబాద్:  ‘ఫిదా’ సినిమాతో బాన్సువాడ భానుమతిగా తమిళ బ్యూటీ సాయి పల్లవి కుర్రకారును ఫిదా చేసిన సంగతి తెలిసిందే. అందంతో పాటు అభినయంతో తెలుగు ప్రేక్షకులను మైమరింపించింది సాయి పల్లవి. తనదైన నటనతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడంలో సాయి పల్లవి కీలక పాత్ర పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ చిత్రం తర్వాత ఆమె నేచురల్ స్టార్ నానితో ‘ఎంసిఎ’ సినిమా చేసింది. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించింది.  దీంతో ఆమెకు తెలుగులో డిమాండ్ పెరిగింది. కానీ, సాయి పల్లవి మాత్రం చేసే సినిమాల విషయంలో కథ కన్నా తన పాత్రకు ప్రాముఖ్యత ఉండేలా చూసుకుంటుంది. తన పాత్రకు ప్రాముఖ్యం లేకపోతే మోహమాటం లేకుండా, అగ్ర దర్శకనిర్మాతలు ఉన్న నో చెప్పేస్తుందట. చాలా సెలెక్టివ్ చిత్రాలను చేసుకుంటు వెళ్తోంది. ప్రస్తుతం తమిళంలో ధనుష్ తో ‘మారి 2’, సూర్య సరసన మరో మూవీ చేస్తోంది. అలాగే టాలీవుడ్ లో శర్వానంద్ సరసన ‘పడి పడి లేచే మనసు’ సినిమాలో నటిస్తోంది.

ఫిదా మూవీ తర్వాత సాయిపల్లవిపై చాలా పుకార్లు షికారు చేసిన విషయం విదితమే. దర్శకనిర్మాతలతో పాటు తోటి నటినటులను సైతం పట్టించుకోకపోవడం, షూటింగ్ స్పాట్లకు లేటుగా రావడం చేస్తోందని గాసిప్స్ వచ్చాయి. ఈ బ్యూటీపై తాజాగా మరో రూమర్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన యువ దర్శకుడు హరీష్ శంకర్ తన తరువాతి చిత్రంగా ‘దాగుడుమూతలు’ అనే మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో ఒక హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకుందాం అనుకున్నాడట. దాంతో ఆమెకు కథ వినిపించారట. కానీ ఆమెకు ఈ కథ నచ్చలేదు. అంతేగాక తన పాత్ర ఇంట్రెస్టింగ్ గా లేకపోవడంతో మోహమాటం లేకుండా నో చెప్పినట్టు టాలీవుడ్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ‘దాగుడుమూతలు’లో హీరోలు ఎవరనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. ఫిలిం నగర్ సమాచారం ప్రకారం రామ్, నితిన్, శర్వానంద్ పేర్లు పరిశీలిస్తున్నారట. ఫిదా పిల్ల కాదనడంతో కథనాయికలుగా రకుల్ ప్రీత్ సింగ్, నివేదా థామస్ లను తీసుకునే యోచనలో హరీష్ శంకర్ ఉన్నట్లు తెలుస్తోంది.

Related Stories: