400 కోట్ల క్లబ్‌లో ‘సాహో’

Saho

 

డై హార్డ్ ఫ్యాన్స్‌కి డార్లింగ్ ప్రభాస్ థ్రిల్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఏఎంబి స్క్రీన్స్‌లో సోమవారం ఫ్యాన్స్‌తో కలిసి ఈ స్టార్ హీరో ‘సాహో’ని వీక్షించారు. తమ అభిమాన హీరోతో కలిసి ఈ బ్లాక్‌బస్టర్ మూవీని చూసే అవకాశం దక్కడంతో అభిమానుల కేరింతలతో థియేటర్ మారుమ్రోగిపోయింది. ప్రభాస్‌తో పాటు చిత్ర నిర్మాత ప్రమోద్ కూడా ఈ స్పెషల్ స్క్రీనింగ్‌కి హాజరయ్యారు. ఇక ఆదివారంతో 10 రోజుల రన్ పూర్తిచేసుకున్న ‘సాహో’ సినిమా వరల్డ్‌వైడ్ 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది.

వసూళ్ల పరంగా బాహుబలి, బాహుబలి- 2 సినిమాల తర్వాత ప్రభాస్ సాధించిన భారీ విజయం ఇది. ఇక నార్త్‌లో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. రివ్యూస్‌కు భిన్నంగా ఈ సినిమా విడుదలైన అన్ని సెంటర్లలో భారీగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ‘సాహో’ హిందీ వర్షన్ వంద కోట్ల మార్క్ అందుకుంది. వీకెండ్ వసూళ్లతో కలుపుకొని ఇది 112 కోట్ల రూపాయలకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు భారీగా వసూళ్లు వస్తున్నాయి. శని, ఆదివారాల్లో ఈ సినిమాకు వసూళ్లు పెరిగాయి.

Saho Cinema Worldwide has grossed over Rs 400 crore

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 400 కోట్ల క్లబ్‌లో ‘సాహో’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.