వార్నర్ అంత స్లోగా బ్యాటింగ్ చేస్తాడా: సచిన్

  లండన్: వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇంత స్లోగా బ్యాటింగ్ చేస్తాడనుకోలేదని క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. లక్ష్యం పెద్దదిగా ఉండడంతో ఆసీస్ బ్యాట్స్‌మెన్లు ఒత్తిడికి గురయ్యారని పేర్కొన్నారు. వార్నర్ నెమ్మదిగా ఆడుతాడని తాను ఊహించలేదన్నారు. తాను ఇప్పటి వరకు ఇంత తక్కువ స్ట్రైక్ రేట్ కలిగిన వార్నర్ చూడలేదన్నారు. ఆసీస్ ఆత్మవిశ్వాసం కోల్పోయి ఆడిందని చెప్పారు. […] The post వార్నర్ అంత స్లోగా బ్యాటింగ్ చేస్తాడా: సచిన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

లండన్: వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇంత స్లోగా బ్యాటింగ్ చేస్తాడనుకోలేదని క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. లక్ష్యం పెద్దదిగా ఉండడంతో ఆసీస్ బ్యాట్స్‌మెన్లు ఒత్తిడికి గురయ్యారని పేర్కొన్నారు. వార్నర్ నెమ్మదిగా ఆడుతాడని తాను ఊహించలేదన్నారు. తాను ఇప్పటి వరకు ఇంత తక్కువ స్ట్రైక్ రేట్ కలిగిన వార్నర్ చూడలేదన్నారు. ఆసీస్ ఆత్మవిశ్వాసం కోల్పోయి ఆడిందని చెప్పారు. భారీ లక్ష్యం ఉన్నప్పుడు సింగిల్స్, డబుల్స్‌తో విజయం సాధించడం కష్టమని సూచించారు. ప్రారంభంలో ఆసీస్ వికెట్లను కాపాడుకుంది.. కానీ స్ట్రైక్ రోటేట్ చేయకపోవడంతో భారత్ గెలుపొందిందని సచిన్ చెప్పారు. టీమిండియా సమిష్టిగా కృషి చేయడంతో విజయం వరించదన్నారు. ఫీల్డింగ్ లో ఆసీస్ చేసిన తప్పిదాలు  ఆ జట్టు కొంపముచ్చాయన్నారు.

 

Sachin Surprised with David Warner’s Slow Batting vs IND

The post వార్నర్ అంత స్లోగా బ్యాటింగ్ చేస్తాడా: సచిన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: