ఆ షాట్ ను ఎవరు బాగా ఆడారు?: ఐసిసి

Sachin-Rohit

 

మాంచెస్టర్: వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో భారత ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ విరోచిత బ్యాటింగ్‌తో శతకం బాదడంతో పాక్‌పై 89 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. 2003 వరల్డ్ కప్‌లో కూడా సచిన్ పాక్‌పై 98 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో తృటిలో శతకం కోల్పోయిన సచిన్ కు మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. 2003 వరల్డ్ కప్‌లో పాక్ పై సచిన్ కొట్టిన సిక్సర్, మొన్న పాక్ తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ కొట్టిన సిక్సర్ ఒకేలా ఉన్నాయి. దీంతో ఎవరు బాగా ఆడారని.. సచిన్, రోహిత్ వీడియోలను ఐసిసి తన ట్వీట్టర్‌లో షేర్ చేసింది. దీనిపై సచిన్ స్పందించాడు. ఇద్దరు ఒకే దేశానికి చెందినవారమని, అందులోను ఇద్దరు ముంబయి నగరవాసులమని, మీరు అడిగిన క్వశ్చన్‌లో జవాబు ఉందని ధీటుగా ఐసిసికి కౌంటర్ ఇచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బొమ్మ పడితే తాము గెలిచినంటూ… బొరుసు పడితే ఐసిసి గెలిచనంటూ అని వ్యంగ్యంగా సచిన్ సమాధానమిచ్చాడు. ఈ వీడియోను ఇప్పటి వరకు ఒక లక్ష ఇరువై వేల మంది లైక్ చేయగా 20 వేల మంది రీ ట్వీట్ చేశారు.

 

 

 

 

Sachin in 2003 or Rohit in 2019 – who Did It Better?

 

 

The post ఆ షాట్ ను ఎవరు బాగా ఆడారు?: ఐసిసి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.