విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సబిత

Sabitha Indra Reddyహైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. తనను అభినందించేందుకు వచ్చే నేతలు, కార్యకర్తలు పూలమాలలు, శాలువాలు తేవొద్దని, వాటికి బదులు పుస్తకాలను తేవాలని సబితా పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమె మొదటి పుస్తకాన్ని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ చేతుల మీదుగా అందుకున్నారు. తెలంగాణ చరిత్ర, ఉద్యమం, సంస్కృతి గురించి ప్రజల్లో చైతన్యం వచ్చేలా గ్రంథాలయ సంస్థ చొరవ తీసుకోవాలని ఆమె తెలిపారు. గ్రంథాలయాలను పరిరక్షించుకునేందుకు రచయితలు, పుస్తక ప్రియులు కృషి చేయాలని సబిత కోరారు. అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించడమే ధ్యేయంగా తాను ముందుకు సాగుతానని ఆమె స్పష్టం చేశారు.

Sabitha Indra Reddy Took Charge as Education Minister

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సబిత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.