18న ప్రీ రిలీజ్ ఈవెంట్

ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న హై రేంజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సాహో’ ట్రైలర్ ఇటీవలే విడుదలై సంచలనాలు సృష్టిస్తోంది. అత్యున్నత సాంకేతిక నిపుణులతో వరల్డ్ క్లాస్ సినిమాగా వస్తోంది ఈ మూవీ. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇక ఇప్పుడు ఈ హీట్‌ని మరింత పెంచేందుకు రామోజీ ఫిల్మ్‌సిటీలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈనెల 18న చేయనున్నారు. అభిమానులు భారీగా వచ్చే ఈ వేడుక కోసం ప్రత్యేక […] The post 18న ప్రీ రిలీజ్ ఈవెంట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న హై రేంజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సాహో’ ట్రైలర్ ఇటీవలే విడుదలై సంచలనాలు సృష్టిస్తోంది. అత్యున్నత సాంకేతిక నిపుణులతో వరల్డ్ క్లాస్ సినిమాగా వస్తోంది ఈ మూవీ. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇక ఇప్పుడు ఈ హీట్‌ని మరింత పెంచేందుకు రామోజీ ఫిల్మ్‌సిటీలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈనెల 18న చేయనున్నారు. అభిమానులు భారీగా వచ్చే ఈ వేడుక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. చిత్ర యూనిట్‌తో పాటు సినీ ప్రముఖులు హాజరయ్యే ఈ వేడుకను ఇప్పటివరకు చేయని రీతిలో భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే… హాలీవుడ్ సినిమాల స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు దర్శకుడు సుజీత్. ‘గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు… స్టేడియంలో కొట్టేవాడికే ఒక రేంజ్ ఉంటది’… అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్‌కి సోషల్ మీడియా బ్రహ్మరథం పట్టింది.

ఇక ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేశారు. ముఖ్యంగా ట్రైలర్‌లో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రభాస్ యాక్షన్ సీన్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. శ్రద్ధా కపూర్‌తో రొమాంటిక్ సీన్స్ కూడా బాగా వర్కవుట్ అయ్యాయి. వాళ్ల కెమిస్ట్రీకి మంచి మార్కులు పడుతున్నాయి. ఈ సినిమా కోసం విదేశీ స్టంట్ కొరియోగ్రాఫర్లు పని చేశారు. 2 నిమిషాల 47 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్‌లో అన్ని ఎమోషన్స్ మిక్స్ చేశాడు దర్శకుడు సుజీత్. దుబాయ్, రొమేనియా లో తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్‌లో హైలైట్ అయ్యాయి. వాటితో పాటు ప్రభాస్ గెటప్ కూడా అదిరిపోయింది. జిబ్రాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు అదనపు ఆకర్షణ. ఆగస్టు 30న ‘సాహో’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ నిర్మించింది.

Saaho pre release event on AUG 18

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 18న ప్రీ రిలీజ్ ఈవెంట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: