13న ‘సాహో’విజువల్ వండర్

  ‘బాహుబలి’ తరువాత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, మేకింగ్ వీడియోలతో ఈ చిత్రం సంచలనం సృష్టించింది. ఇక ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సాహో’ ట్రైలర్‌ను ఈనెల 13న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. యువి క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత […] The post 13న ‘సాహో’ విజువల్ వండర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

‘బాహుబలి’ తరువాత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, మేకింగ్ వీడియోలతో ఈ చిత్రం సంచలనం సృష్టించింది. ఇక ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సాహో’ ట్రైలర్‌ను ఈనెల 13న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. యువి క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఏక కాలంలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మూడు భాషల్లో ఒకేసారి షూట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఒకే రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక రెబల్‌స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘షేడ్స్ ఆఫ్ సాహో’కు అద్భుతమైన స్పందన వచ్చింది. అదేవిధంగా ఈ చిత్ర హీరోయిన్ అయిన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ బర్త్‌డే కానుకగా విడుదల చేసిన ‘షేడ్స్ ఆఫ్ సాహో 2’ వీడియోకు కూడా మంచి స్పందన వచ్చింది. ఈ స్పెషల్ వీడియోలో శ్రద్ధాకపూర్ క్యారెక్టర్ లుక్‌ను రివీల్ చేశారు. ఈ వీడియోలో ప్రభాస్, శ్రద్ధాకపూర్ స్టైలిష్ లుక్స్, ఇంటర్నేషనల్ స్టాండర్ట్ మేకింగ్ హైలైట్ గా నిలిచాయి.

Saaho movie trailer launching on June 13th

Related Images:

[See image gallery at manatelangana.news]

The post 13న ‘సాహో’ విజువల్ వండర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: