పెళ్లిపీటలెక్కబోతున్న ‘సాహో’బ్యూటీ ?

Shraddha Kapoor Marriageముంబయి: బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ వచ్చే ఏడాది పెళ్లిపీటలెక్కబోతున్నట్టు బీ-టౌన్ టాక్. గతంలో నిర్మాత, నటుడు ఫర్హాన్ అక్తర్ తో శ్రద్ధా సహజీవనం చేసినట్లు పుకార్లు షికార్ చేశాయి. కానీ ఆ తరువాత ఈ జంట విడిపోయిందట. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. అయితే కొంతకాలంగా ఈ బ్యూటీ బాల్యస్నేహితుడు, ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్టతో డేటింగ్ చేస్తుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. దీంతో ఇప్పుడు రోహనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందట శ్రద్ధా. ఈ బ్యూటీ వయసు 32. దీంతో ఇంట్లో వారు కూడా ఆమెను పెళ్లి చేసుకోమని అడుతున్నారట. అందుకే ఇంట్లో వారికి రోహన్ గురించి చెప్పి పెళ్లికి ఒప్పించిందని తెలిసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2020లో ఈ జంట పెళ్లిపీటలు ఎక్కడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుతం శ్రద్ధా బాలీవుడ్ లో ‘చిచ్చోరే’, ‘బాఘీ 3’ ‘ఎబిసిడి 3’ చిత్రాలు చేస్తుంది. అలాగే తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరన ‘సాహో’ సినిమాలో నటిస్తోంది.

Saaho Actress To Marry Photographer Rohan Shrestha?

Related Images:

[See image gallery at manatelangana.news]