ఎస్వీఆర్ నా ఆరాధ్య నటుడు: చిరంజీవి

    సంజయ్ కిషోర్ రూపొందించిన ఎస్.వి.రంగారావు ఫొటో బయోగ్రఫి ‘మహానటుడు’ పుస్తక ఆవిష్కరణ వేడుక హైదరాబాద్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరై ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తొలిప్రతిని ప్రముఖ వ్యాపారవేత్త పెండ్యాల హరనాథ్ బాబు ఒక లక్షా వెయ్యి నూట పదహార్లు చెల్లించి అందుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ “ఎస్‌వి రంగారావు నా ఆరాధ్య నటుడు. ఆయనంటే అపారమైన అభిమానం. ఆయనపై వచ్చిన ఈ పుస్తకం ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నాను. […] The post ఎస్వీఆర్ నా ఆరాధ్య నటుడు: చిరంజీవి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

సంజయ్ కిషోర్ రూపొందించిన ఎస్.వి.రంగారావు ఫొటో బయోగ్రఫి ‘మహానటుడు’ పుస్తక ఆవిష్కరణ వేడుక హైదరాబాద్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరై ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తొలిప్రతిని ప్రముఖ వ్యాపారవేత్త పెండ్యాల హరనాథ్ బాబు ఒక లక్షా వెయ్యి నూట పదహార్లు చెల్లించి అందుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ “ఎస్‌వి రంగారావు నా ఆరాధ్య నటుడు. ఆయనంటే అపారమైన అభిమానం. ఆయనపై వచ్చిన ఈ పుస్తకం ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నాను. నా కెరీర్ ప్రారంభం నుంచి నా అభిమాన నటులెవరంటే ఎస్వీఆర్, సావిత్రి, కన్నాంబ పేర్లు చెబుతుంటాను. ఎస్వీఆర్ నటన చూసి ఎంతో నేర్చుకోవచ్చు. నటనలో ఆయన ఓ ఎన్‌సైక్లోపీడియా.

ఇక చరణ్ సినిమాల్లోకి వస్తానన్నప్పుడు కూడా ఎస్‌వి రంగారావు సినిమాలు చూపించేవాడిని. అలా నేను, మా అబ్బాయి ఎస్‌వి రంగారావు నుంచి స్ఫూర్తి పొందాం. ఇక సంజయ్ కిషోర్ పుస్తకం వెనుక కళపై ఉన్న తపన, ఎస్‌వి రంగారావుపై ఉన్న అభిమానం కనిపిస్తున్నాయి. ఈ పుస్తకంలోని ఫొటోలను చూస్తుంటే విజువల్ జర్నీలా ఉంది. భావితరాలకు అందివ్వడానికి ఇలాంటి పుస్తకాలు ఉపయోగపడతాయి”అని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి భరద్వాజ, అలీ, రావి కొండలరావు, రోజా రమణి, రేలంగి నరసింహరావు, కె.వి.రంగనాథ్, బొలినేని క్రిష్ణయ్య, వడ్డిరాజు రవిచంద్ర, ఎస్‌వి రంగారావు మేనల్లుడు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

S.V Ranga Rao book launched by Megastar Chiranjeevi

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎస్వీఆర్ నా ఆరాధ్య నటుడు: చిరంజీవి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: