నేరుగా రైతుల ఖాతాల్లోకి ‘రైతుబంధు’…

  ఖమ్మం : పెట్టుబడి ఖర్చులకు గాను రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం చేరుతుంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గత ఏడాది నుంచి రైతుబంధు అనే నూతన పథకాన్ని ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారు.  ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగుకు పెట్టుబడి సాయం అందించి రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి సీజన్‌కు ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి నగదు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పకడ్బందీగా ఈ […] The post నేరుగా రైతుల ఖాతాల్లోకి ‘రైతుబంధు’… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఖమ్మం : పెట్టుబడి ఖర్చులకు గాను రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం చేరుతుంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గత ఏడాది నుంచి రైతుబంధు అనే నూతన పథకాన్ని ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారు.  ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగుకు పెట్టుబడి సాయం అందించి రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ ఏడాది నుంచి సీజన్‌కు ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి నగదు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పకడ్బందీగా ఈ పథకాన్ని అమలు చేస్తుంది. దీంతో ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌కు జిల్లాలో 2 లక్షల79వేల 198 మంది రైతులకు చెందిన 6.87 లక్షల ఎకరాల భూమికి రూ. 343.10 కోట్లు పెట్టుబడి సాయం అందనుంది. ఇప్పటికే ఈ ప్రక్రియను వ్యవసాయశాఖ ప్రారంభించింది. రైతుల బ్యాంక్ ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అయ్యే వి ధంగా వ్యవసాయశాఖ చ ర్యలు చేపట్టింది.

గత ఏడాది ఒక్కొ సీజన్‌కు రూ. 4వేల చొప్పున రైతులకు పెట్టుబడి సాయం అందించి ప్రోత్సహిచింది. అప్పుడు ఖరీఫ్, రబీ సీజన్‌లలో వేరువేరుగా ఎకరాకు రూ. 4వేల చొప్పున పంటలకు పెట్టుబడి సాయం రూ. 8వేలను ప్రభుత్వం అందించింది. ఖరీఫ్ సీజన్‌లో చెక్కుల రూపంలో పెట్టుబడిని అందించిన ప్రభుత్వం రబీ సీజన్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పెట్టుబడి సాయాన్ని రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. అదే విధానాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించే విధంగా చర్యలు తీసుకున్నారు.

ఎకరాకు రూ. 5వేల పెట్టుబడి సాయం:

ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి ఎకరాకు రూ. 5వేల చొప్పున ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుంది. గత ఏడాది సీజన్‌కు రూ. 4వేల చొప్పున పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం రైతులను మరింత ప్రోత్సహించేందుకు ఈ ఏడాది నుంచి ఎకరాకు మరో వెయ్యి పెంచింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఎకరాకు సీజన్‌కు మరో వెయ్యి పెంచుతామని పేర్కొంది. మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏ డాది ఖరీఫ్ సీ జన్ నుంచి ఎకరాకు రూ.5వేల చొప్పున రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి ఎకరాకు రూ. 5వేల చొప్పున పెట్టుబడి సాయం అందించే ప్రక్రియను వ్యవసాయశాఖ చేపట్టింది.

2,79,198 మంది రైతులకు పెట్టుబడి సాయం :

జిల్లాలో సొంత భూములతో పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన 2,79,198 మంది రైతులకు ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతుబంధు పథకం వర్తించనుంది. ప్రభుత్వం గత ఏడాది నుంచి అందిస్తున్న పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన రైతులకు, అటవీ భూములకు (పోడు)హక్కు పత్రాలు కలిగిన రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింప చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

687 లక్షల ఎకరాల భూమికి రూ.343.10 కోట్లు కేటాయింపు:

జిల్లాలో వివిధ రకాలు కలిగి ఉన్న 6.87 లక్షల ఎకరాల భూమికి ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిచేందుకు చర్యలు తీసుకుంది. మొత్తం భూమిలో పంటల సాగుకు పెట్టుబడి సాయంగా రూజ. 343.10 కోట్లను కేటాయించింది. ఈ సహాయంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులు తమ భూముల్లో సాగు చేసే పంటలకు సంబంధించిన విత్తనాలు,ఎరువులను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ లక్షం కూడ అదే. పెట్టుబడి సాయంతో పంటలను సాగు చేసుకోవాలని ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తోంది.

రైతుబంధు సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
-ఏ. ఝాన్సీలక్ష్మికుమారి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు అందిస్తున్న రైతుబంధు పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఏ. ఝాన్సీలక్ష్మికుమారి రైతులకు సూచించారు. పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కొనుగోలు కోసం రైతుబంధు పథకం నగదును వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం రైతులకు, వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. ఖరీఫ్ సీజన్‌కు అనుకూలంగా పెట్టుబడి సహాయం రైతులకు బ్యాంక్ ఖాతాలకు చేరుతుందన్నారు. ఆ ఖాతాల నుంచి నగదును వివిధ రకాలుగా పంటల పెట్టుబుడులకు వినియోగించుకోవచ్చన్నారు.

Rythu Bandhu Scheme is Boon for Farmers

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నేరుగా రైతుల ఖాతాల్లోకి ‘రైతుబంధు’… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.