వీఆర్ఓ నిర్లక్షం: అన్నదాతకు అందని రైతుబంధు

బోనకల్ ః అన్నదాతకు తాను అందించే ప్రతి పథకం చేరాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత తపించినా కింది స్దాయి రెవెన్యూ ఉద్యోగుల నిర్వాకంతో ముఖ్యమంత్రి పథకాలు రైతులకు చేరటంలేదు. రెండేళ్లుగా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనకు ఎన్ని చర్యలు చేపట్టినా అనేక గ్రామాలలో రైతుల వివరాలు నమోదులో జరిగిన తీవ్ర జాప్యం రైతులకు రైతుబంధు అందుకోలేని దుస్తుతి తీసుకొచ్చింది. బోనకల్ మండల పరిధిలోని ఆళ్ళపాడు రెవెన్యూ గ్రామానికి చెందిన పారా నాగమణి, పారా శ్రీహర్షవర్ధన్‌లు తమకు చెందిన సర్వే […] The post వీఆర్ఓ నిర్లక్షం: అన్నదాతకు అందని రైతుబంధు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బోనకల్ ః అన్నదాతకు తాను అందించే ప్రతి పథకం చేరాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత తపించినా కింది స్దాయి రెవెన్యూ ఉద్యోగుల నిర్వాకంతో ముఖ్యమంత్రి పథకాలు రైతులకు చేరటంలేదు. రెండేళ్లుగా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనకు ఎన్ని చర్యలు చేపట్టినా అనేక గ్రామాలలో రైతుల వివరాలు నమోదులో జరిగిన తీవ్ర జాప్యం రైతులకు రైతుబంధు అందుకోలేని దుస్తుతి తీసుకొచ్చింది. బోనకల్ మండల పరిధిలోని ఆళ్ళపాడు రెవెన్యూ గ్రామానికి చెందిన పారా నాగమణి, పారా శ్రీహర్షవర్ధన్‌లు తమకు చెందిన సర్వే నెంబర్ 345/అ1లో ఎకరం 34 గుంటల భూమికి, సర్వే నెంబర్ 329/ఆలో 2 ఎకరాల 34 గుంటల భూమికి పాసు పుస్తకం కోసం ఆ గ్రామ రెవెన్యూ అధికారికి బ్యాంకులో భూబదలాయింపు (మ్యుటేషన్) కోసం సుమారు 20 వేల రూపాయలు చెల్లించిన రశీదు, క్రయం పొందిన సంతకాల నకలు, బ్యాంకు, ఆధార్ జిరాక్యులు అందజేశారు. సంవత్సరం క్రితం వివరాలు ఇచ్చిన వారు అనేక మార్లు వాటి విషయంమై వీఆర్ఓను ఆభూమి రికార్డులలోకి ఎక్కించాలని, పాసు పుస్తకం ఇప్పించాలని వేడుకొన్నారు. ఇటీవల నెల రెండు నెలల క్రితం వీఆర్వో మీఫైలు పోయిందని, మరల కొత్త ఫైలు తయారు చేస్తానని చెప్పి బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు వివరాలు తీసుకొన్నారు.

ప్రభుత్వం ఈనెల 10వ తేదీ వరకు తహశీల్దారు డిజిటల్ సిగ్నేచర్ అయిన రైతులందరికి ప్రభుత్వం అందించే రైతుబంధు వర్తిస్తుందని ప్రకటించిటంతో ఇప్పుడు అన్ని వివరాలు అందించిన ఆ రైతులు రైతుబంధు కింద వచ్చే సమారు 23 వేల రూపాయలు నష్టపోయారు. దీంతో పాటు సకాలంలో పాసు పుస్తకాలు అందకపోవటంతో పంటరుణాలు పొందలేని పరిస్తితి ఏర్పడింది. ఇదేంటని వీఆర్వోను అడిగితే ఫైలు పోయిందని నిర్లక్షంగా సమాధానం చెబుతున్నాడని ఆ రైతులు తెలిపారు. గ్రామంలో అనేక మంది రైతుల భూముల వివరాలు తారుమారయ్యాయని అనేక ఫిర్యాదులున్నాయి. తొలిదఫా ఇచ్చిన రైతుబంధు పైకం గ్రామంలో సగం మంది రైతులకు అందలేదు. గ్రామంలో ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులున్నారు. ఎక్కువ మంది రైతులు తమ భూములను కొనుగోలు చేసినవారే. దీంతో వీఆర్ఓ వారి వివరాలను సరిగ్గా నమోదు చేయకపోవటంతో పాటు డబ్బులిస్తేనే పనిచేస్తానని బెదిరించి అనేక మంది వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేశాడని ఇటీవల గ్రామం వచ్చిన జిల్లా రెవెన్యూ అధికారులకు లిఖిత పూర్వ ఫిర్యాదు చేశారు.

అయిన జిల్లా అధికారులు స్పందించకపోవటంతో వీఆర్ఓ మరింత నిర్లక్షంగా వ్యవహరిస్తున్నాడు. దీంతో పాటు వీఆర్ఏ ఉద్యోగం నుండి ప్రమోషనుపై వీఆర్ఓ వచ్చిన ఆయనకు రెవెన్యూపై సరియైన అవగాహన లేకపోవటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదే విషయంపై గ్రామంలో రైతులు మండల రెవెన్యూ అధికారులకు జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేయగా రెండు రోజులు గ్రామంలో వీఆర్వోలు, ఆర్‌ఐలతో క్యాపు నిర్వహించి కొందరు రైతుల వివరాలు సేకరించారు. అయినప్పటికి ఎంతో మంది రైతులకు పాసు పుస్తకాలు అందని పరిస్తితి నెలకొంది. ఆళ్ళపాడు రైతులకు తమ భూముల విషయంలో జరిగిన అన్యాయాన్ని జిల్లా అధికారులు స్పందించి పరిష్కరించాలని కోరుతున్నారు.

Rythu Bandhu Funds Not Receiving Farmer

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వీఆర్ఓ నిర్లక్షం: అన్నదాతకు అందని రైతుబంధు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: