పిడుగా…అగ్ని ప్రమాదమా..?

  *రష్యా విమాన ప్రమాదంపై కొనసాగుతున్న సస్పెన్స్ * 41 మంది మృతి మాస్కో : రష్యాలో జరిగిన విమాన ప్రమాదంలో 41 మందికి పైగా మృతి చెందారు. ఆదివారం స్థానిక షెరెమెత్యెవో ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన విమానంలో అత్యవసర ల్యాండింగ్ దశలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్ముకుంది. మృతుల సంఖ్యపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. అయితే 41 మృతదేహాలను అత్యయిక సహాయక సిబ్బంది వెలికితీసినట్లు, విమాన రికార్డులను శకలాల నుంచి కనుగొన్నట్లు అధికారులు సోమవారం […] The post పిడుగా… అగ్ని ప్రమాదమా..? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

*రష్యా విమాన ప్రమాదంపై కొనసాగుతున్న సస్పెన్స్
* 41 మంది మృతి

మాస్కో : రష్యాలో జరిగిన విమాన ప్రమాదంలో 41 మందికి పైగా మృతి చెందారు. ఆదివారం స్థానిక షెరెమెత్యెవో ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన విమానంలో అత్యవసర ల్యాండింగ్ దశలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్ముకుంది. మృతుల సంఖ్యపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. అయితే 41 మృతదేహాలను అత్యయిక సహాయక సిబ్బంది వెలికితీసినట్లు, విమాన రికార్డులను శకలాల నుంచి కనుగొన్నట్లు అధికారులు సోమవారం తెలిపారు.

విమానంలో తొలుత సాంకేతిక లోపం ఏర్పడటానికి దారితీసిన పరిస్థితులు ఏమిటీ? అత్యవసర ల్యాండింగ్ దశలో ఏమి జరిగిందనేది తెలియలేదు. దీనిపై అన్ని విధాలుగా దర్యాప్తు చేపట్టినట్లు, త్వరలోనే పూర్తి నివేదికను అందించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే లోపాల దశలో విమానం ఉన్నప్పుడే అక్కడ వాతావరణం సరిగ్గా లేని దశలో విమానంపై పిడుగు పడిందని, దీనితో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.

విమానంలో మొత్తం 78 మంది ప్రయాణికులు ఉన్నారు. కొందరు ప్రాణాలతో బయటపడి పరుగులు తీశారని, గాయపడ్డ పది మంది వరకూ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని వెల్లడైంది. సూపర్‌జెట్ విమానం స్థానిక విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌కు దిగినప్పుడు విమానంలో నిప్పు అంటుకోవడంతో తీవ్రస్థాయిలో గందరగోళ పరిస్థితి ఏర్పడిందని రష్యా వార్తాసంస్థ టాస్ తెలిపింది. రద్దీగా ఉండే షెరెమెత్యెవో ఎయిర్‌పోర్టు నుంచి విమానం బయలుదేరగానే సాంకేతిక లోపాలు గమనించడంతో సిబ్బంది విపత్తు సంకేతాలు వెలువరించి విమానాన్ని హుటాహుటిన బలవంతంగా కిందికి దింపేందుకు యత్నించారు. ఈ క్రమంలో విమానంలో మంటలు వ్యాపించాయి.

 

Russia continues to suspect the plane crash

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పిడుగా… అగ్ని ప్రమాదమా..? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: