రష్యా విమానంలో మంటలు

ఇద్దరు మృతి, పలువురికి గాయాలు మాస్కో : రష్యాలో ఆదివారం ఒక విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. ప్రయాణికులతో కూడిన సూపర్‌జెట్ విమానం స్థానిక విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌కు దిగినప్పుడు కనీసం ఇద్దరు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. విమానంలో నిప్పు అంటుకోవడంతో తీవ్రస్థాయిలో గందరగోళ పరిస్థితి ఏర్పడిందని రష్యా వార్తాసంస్థ టాస్ తెలిపింది. రద్దీగా ఉండే షెరెమెత్యెవో ఎయిర్‌పోర్టు నుంచి విమానం బయలుదేరగానే సాంకేతిక లోపాలు గమనించడంతో సిబ్బంది విపత్తు సంకేతాలు వెలువరించి విమానాన్ని […] The post రష్యా విమానంలో మంటలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

మాస్కో : రష్యాలో ఆదివారం ఒక విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. ప్రయాణికులతో కూడిన సూపర్‌జెట్ విమానం స్థానిక విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌కు దిగినప్పుడు కనీసం ఇద్దరు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. విమానంలో నిప్పు అంటుకోవడంతో తీవ్రస్థాయిలో గందరగోళ పరిస్థితి ఏర్పడిందని రష్యా వార్తాసంస్థ టాస్ తెలిపింది. రద్దీగా ఉండే షెరెమెత్యెవో ఎయిర్‌పోర్టు నుంచి విమానం బయలుదేరగానే సాంకేతిక లోపాలు గమనించడంతో సిబ్బంది విపత్తు సంకేతాలు వెలువరించి విమానాన్ని హుటాహుటిన బలవంతంగా కిందికి దింపేందుకు యత్నించారు. ఈ క్రమంలో విమానంలో మంటలు వ్యాపించాయి. పలువురు గాయపడ్డారని తెలిపిన వార్తాసంస్థ ఎంత మందికి ఏ స్థాయిలో గాయాలు అయ్యాయనేది వెల్లడించలేదు. విమానాన్ని కిందికి దింపే తొలి ప్రయత్నం ఫలించలేదని, తరువాతి దశలో విమానం రన్‌వేనుబలంగా తాకిందని వెల్లడైంది. అయితే విమానంలో 150 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని, మంటలు చెలరేగడంతో ఎందరు మృతి చెందారనేది నిర్థారణ కాలేదని వెల్లడైంది. ఒక్కరోజు క్రితమే అమెరికాలో విమానం ఒకటి అదుపు తప్పి రన్‌వే నుంచి పక్కనున్న నదిలోకి దూసుకుపోయింది. ఈ ఘటన సమయంలో విమానంలో 150 మంది ప్రయాణికులు ఉన్నారు. రష్యాలో ప్రయాణికులతో కూడిన విమానం దేశంలోని అంతర్గత రూట్లో వెళ్లే దశలోనే ప్రమాదం సంభవించింది. ప్రాణనష్టం ఏమీ జరగలేదని, భారీ ముప్పు తప్పిందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఈ విమాన దుర్ఘటనకు సంబంధించి పలు వివరాలు అందాల్సి ఉందని అనధికారిక వర్గాలు తెలిపాయి.

Russia Aeroflot plane fire

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రష్యా విమానంలో మంటలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: