గ్రామీణ విత్తనోత్పత్తి శిక్షణ కార్యక్రమం

  వరంగల్ అర్బన్: గ్రామీణ విత్తనోత్పత్తి పథకంలో భాగంగా గ్రేటర్ వరంగల్ పరిధి 58వ డివిజన్ వంగపహాడ్‌లో రబీ సీజన్‌కు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వ్యవసాయ అధికారి అనురాధ తెలిపారు. అనురాధ మాట్లాడుతూ… రైతులు వేసిన పంటల్లో పూత దశ నిర్వహణలో భాగంగా రెండవ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. వరి ఇప్పుడు పూతకు దగ్గరగా ఉండడంతో పూత దశలో బెరుకులు, కలుపు గాని వెంటనే తొలగించాలని సూచించారు. పూత దశలో ఏర్పడే బెరుకులు, […]

 

వరంగల్ అర్బన్: గ్రామీణ విత్తనోత్పత్తి పథకంలో భాగంగా గ్రేటర్ వరంగల్ పరిధి 58వ డివిజన్ వంగపహాడ్‌లో రబీ సీజన్‌కు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వ్యవసాయ అధికారి అనురాధ తెలిపారు. అనురాధ మాట్లాడుతూ… రైతులు వేసిన పంటల్లో పూత దశ నిర్వహణలో భాగంగా రెండవ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. వరి ఇప్పుడు పూతకు దగ్గరగా ఉండడంతో పూత దశలో బెరుకులు, కలుపు గాని వెంటనే తొలగించాలని సూచించారు. పూత దశలో ఏర్పడే బెరుకులు, కలుపును నివారించడం వల్ల నాణ్యమైన విత్తనాన్ని పొందవచ్చు. అయితే వరిలో అగ్గి తెగులు ఉండడాన్ని గమనించి ట్రైసైక్లోజోల్ 0.06 ఎంఎల్/హెచ్ నీటిని ఎకరానికి పిచికారి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఒ జ్యోతి, గ్రామరైతులు తదితరులు పాల్గొన్నారు.

Rural seed production training program in Warangal Arban

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: