పతనానికి బ్రేక్ వేస్తాం

రూపాయిపై కేంద్రం, ఆర్‌బిఐ అవరసమైన చర్యలు చేపడతాయి ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ గార్గ్  న్యూఢిల్లీ: రూపాయి పతనానికి బ్రేక్ వేసేందుకు ప్రభుత్వం, ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) అవసరమైన ప్రతి చర్య చేపడుతుందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ పేర్కొన్నారు. బుధవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ చారిత్ర కనిష్టం 72.91కి పడిపోయిన నేపథ్యంలో ఆయన ఈవిధంగా స్పందించారు. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం వంటి కారణాలు […]

రూపాయిపై కేంద్రం, ఆర్‌బిఐ అవరసమైన చర్యలు చేపడతాయి
ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ గార్గ్ 

న్యూఢిల్లీ: రూపాయి పతనానికి బ్రేక్ వేసేందుకు ప్రభుత్వం, ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) అవసరమైన ప్రతి చర్య చేపడుతుందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ పేర్కొన్నారు. బుధవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ చారిత్ర కనిష్టం 72.91కి పడిపోయిన నేపథ్యంలో ఆయన ఈవిధంగా స్పందించారు. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం వంటి కారణాలు రూపాయిపై ప్రభావం చూపుతున్నాయి. రూపాయి పతనానికి ఎలాంటి ప్రాథమిక కారణాలు లేవని, మార్కెట్ ఆపరేటర్ల అతి చర్యలను ప్రతిబింబిస్తోందని గార్గ్ ట్విట్టర్‌లో తెలిపారు. రూపాయి 72 స్థాయికి పడిపోవడంతో ఆర్‌బిఐ జోక్యం చేసుకుంటుందని ఇన్వెస్టర్లు భావించారు.

కొలుకున్న రూపాయి
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ స్వల్పంగా కొలుకుంది. బుధవారం 62.18కు దేశీయ కరెన్సీ విలువ చేరింది. మంగళవారం 72.73కు పతనమైన రూపాయి.. బుధవారం ఓ దశలో మరింతగా క్షీణించి 72.91కు చేరుకుంది. ముడిచమురు ధరలు పెరగడంతో పాటు విదేశీ మదుపర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటం రూపాయిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మరోవైపు ప్రపంచ వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో బ్యాంకులు, దిగుమతి దారుల నుంచి డిమాండ్ కారణంగా డాలర్ బలపడుతోంది. మంగళవారం 72.69 వద్ద ముగిసిన రూపాయి బుధవారం మరింత పతనమైంది. ఆరంభ ట్రేడింగ్‌లో 22 పైసలు నష్టపోయి 72.91 వద్ద అత్యంత జీవనకాల కనిష్ఠ స్థాయికి చేరుకుంది.