నెట్టింట్లో యాపిల్ కొత్త ఐఫోన్ల ధరలు లీక్.!

ముంబయి: సెప్టెంబర్ 12వ తేదీన సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ తన కొత్త ఐఫోన్లను రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి 10.30 గంటలకు కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్ క్యాంపస్‌లో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో గ్యాదర్ రౌండ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. ఇదే ఈవెంట్‌లో యాపిల్ తన కొత్త ఉత్పత్తులను విడుదల చేయనుంది. కాగా, మరో రెండు రోజుల్లో విడుదల కానున్న యాపిల్ నూతన ఐఫోన్ల ధరలు తాజాగా లీకయ్యాయి. యాపిల్ తన గ్యాదర్ రౌండ్ […]

ముంబయి: సెప్టెంబర్ 12వ తేదీన సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ తన కొత్త ఐఫోన్లను రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి 10.30 గంటలకు కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్ క్యాంపస్‌లో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో గ్యాదర్ రౌండ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. ఇదే ఈవెంట్‌లో యాపిల్ తన కొత్త ఉత్పత్తులను విడుదల చేయనుంది. కాగా, మరో రెండు రోజుల్లో విడుదల కానున్న యాపిల్ నూతన ఐఫోన్ల ధరలు తాజాగా లీకయ్యాయి. యాపిల్ తన గ్యాదర్ రౌండ్ ఈవెంట్‌లో 3 ఐఫోన్లను విడుదల చేయనున్నట్టు సమాచారం. ఐఫోన్ 10ఎస్, 10ఎస్ ప్లస్, 10సి ఫోన్లను విడుదల చేయవచ్చని తెలిసింది. ఐఫోన్ 10సి ఫోన్ ప్రారంభ ధర రూ.61వేలు ఉండనున్నట్టు సమాచారం. అలాగే 10ఎస్ ప్రారంభ ధర రూ.77వేలు, 10ఎస్ ప్లస్ ప్రారంభ ధర రూ.88వేలుగా ఉండబోనుందని వెల్లడైంది. ఈ మూడు ఫోన్లు 64, 256 జిబి స్టోరేజ్ వేరియెంట్లలో రిలీజ్ కానున్నాయని తెలింది. అంతేకాకుండా ఐఫోఎన్ 10ఎస్, 10ఎస్ ప్లస్ ఫోన్లకు గాను 512 జిబి స్టోరేజ్ వేరియెంట్‌ను విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఇవన్నీ నెట్టింట్లో వస్తున్న ఊహాగానాలే, వీటిలో నిజం ఎంతో తెలియాలంటే  ఈ ఫోన్ల విడుదల అయ్యే వరకు ఆగక తప్పదు.

Comments

comments

Related Stories: