ఆర్‌టిసి బస్సు బోల్తా…

భద్రాద్రి కొత్తగూడెం:  బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక,నానినేని ప్రోలురెడ్డి పాలెం సరిహద్దు ప్రాంతంలోని బిడ్జ్రి సమీపంలో ఆర్‌టిసి బస్సు బోల్తా పడిన సంఘటన శనివారం చోటు చేసుకుంది.స్థానికులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలం నుంచి కొత్తగూడెం డిపోకి చెందిన టిఎస్ 04 యూఏ 4815 నెంబర్ గల బస్సు విజయవాడ వెళ్తున్న క్రమంలో సారపాక గ్రామం దాటి నాగినేని ప్రోలురెడ్డి పాలెం సమీపంలోని బిడ్జ్రి మీద వున్న గుంతలో వర్షపు నీరు చేరడంతో బస్సు ఒక్కసారిగా గుంతలో పడి అదుపుతప్పి […]

భద్రాద్రి కొత్తగూడెం:  బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక,నానినేని ప్రోలురెడ్డి పాలెం సరిహద్దు ప్రాంతంలోని బిడ్జ్రి సమీపంలో ఆర్‌టిసి బస్సు బోల్తా పడిన సంఘటన శనివారం చోటు చేసుకుంది.స్థానికులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలం నుంచి కొత్తగూడెం డిపోకి చెందిన టిఎస్ 04 యూఏ 4815 నెంబర్ గల బస్సు విజయవాడ వెళ్తున్న క్రమంలో సారపాక గ్రామం దాటి నాగినేని ప్రోలురెడ్డి పాలెం సమీపంలోని బిడ్జ్రి మీద వున్న గుంతలో వర్షపు నీరు చేరడంతో బస్సు ఒక్కసారిగా గుంతలో పడి అదుపుతప్పి లోయలో పడింది. లోయలో బస్సు పడిన వెంటనే స్ధానిక ప్రజలు స్పందించి క్షతగాత్రులను బయటకు తీశారు. విషయం తెలుసుకున్న బూర్గంపాడు ఎస్‌ఐ పి సంతోష్ సంఘటన స్ధలానికి చేరుకుని బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తమ సిబ్బంది సహకారంతో బయటకు తీసి, వెంటనే 108 ద్వార మెరుగైనా వైద్యంకోసం భద్రాచలంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 35మంది ప్రయాణికులు ఉన్నారు.ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎటువంటి ప్రాణానష్టం జరగకపోవడంతో ఒక్కసారిగా ప్రయాణికులు,అధికారులు ఊపిరిపిల్చుకున్నారు. సంఘటప స్ధలంలో బస్సు బోల్తా పడిన ప్రదేశంలో ఎస్‌ఐ సంతోష్ పరిశీలించారు. పూర్తి స్ధాయిలో బూర్గంపాడు ఎస్‌ఐ సంతోష్ ఆధ్వర్యలంలో పోలిస్ సిబ్బంది ప్రయాణికులకు సహాయచర్యలు అందించిన తీరు పట్ల పలువురు మండల ప్రజలు బూర్గంపాడు పోలిస్‌లను అభినందిస్తున్నారు.

Comments

comments

Related Stories: